శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 48, 49 / Sri Lalitha Chaitanya Vijnanam - 48, 49

🌹.  శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 28 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 48, 49 / Sri Lalitha Chaitanya Vijnanam - 48, 49 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

20. శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ

మరాళి మందగమనా మహాలావణ్య శేవధి

🌻 48. “మహాలావణ్య శేవధి: 🌻

శ్రీదేవి మహాలావణ్య నిధి అని అర్థము. లావణ్య మనగా అతిశయముతో కూడిన సౌందర్యము. మహాలావణ్య మనగా మొత్తము సృష్టి లావణ్యమని గుర్తించవలెను. శేవధి అనగా నిధి అని అర్థము. కావున సృష్టి యందలి అతిశయముతో కూడిన సౌందర్యము, మృదుత్వము ఎక్కడ దర్శనమిచ్చునో అక్కడ శ్రీదేవి ప్రస్ఫుటముగ నున్నదని భావింపవలెను.

నామారాధన కేవలము పూజా సమయమున మాత్రమే గాక, సృష్టి పరిశీలనమున గూడ జరుగు చుండవలెను. అపుడే అది ఉపాసన కాగలదు. కేవలము పూజా గృహమునకే పరిమితము చేసిన ఉపాసన అసంపూర్ణ మగును. శ్రీదేవియే సృష్టి వెలుగు. ఇచ్చట తెలుపబడిన వెలుగు లావణ్యమైన వెలుగు. ముత్యము లందలి నిగనిగ ఛాయను లావణ్యమని అందురు.

అమ్మవారి కాంతి ధవళముగను, లావణ్యముగను, అరుణముగను, నీలముగను, పసుపుగను సాధకుని స్థితులను బట్టి గోచరించును. ముత్యపు కాంతి సౌమ్యమైన మరియు సంపూర్ణమైన కాంతి. అది ధవళకాంతివలె చూపరులకు ఇబ్బంది కలిగించదు. ఆహ్లాదము కలిగించును. చంద్రుని వెన్నెలవలె మనస్సును ఊరట పరచును. చంద్రకాంతి లావణ్యకాంతి.

సౌందర్యమునకు చంద్రకాంతియే సరిపోల్చదగినది, సూర్యకాంతి కాదు. అమ్మ సౌందర్య సాన్నిధ్యము మృదువై, మధురమై, సుందరమై ఉపాసకులను లాలించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 48 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻. 48. Mahā-lāvanya-śevadhiḥ महा-लावन्य-शेवधिः (48) 🌻

She is the treasure house of beauty. Saundarya Laharī (verse 12) says “The best of thinkers such as Brahma and others are at great pains to find a suitable comparison to your beauty. Even the celestial damsels, out of great eagerness to get a glimpse of your splendour, mentally attain a condition of absorption into Śiva, which is unobtainable even by penance.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 49 / Sri Lalitha Chaitanya Vijnanam - 49 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత

శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ

🌻 49. 'సర్వారుణా' 🌻

అరుణ వర్ణము అనగా ఎల్లని రంగు. అమ్మవారికి ఎఱ్ఱనిరంగు ప్రీతి కలిగించునని పలుమార్లు సహస్ర నామములయందు గోచరించును.

ఆమె వస్త్రము అరుణారుణ వస్త్రమని ముప్పది ఏడవ నామము తెలుపుచున్నది. ఆమె పెదవులు ఎల్లనివని, ఎఱ్ఱని పగడకాంతి కలిగియున్నవని 24వ నామము వివరించుచున్నది. ఆమె కిరీటమున పద్మరాగమణులు కలవని, 14వ నామము తెలుపుచున్నది. ఆమె ఎఱ్ఱని కాంతి ప్రవాహమున బ్రహ్మాండ మండలములు మునిగియున్నవని తెలుపుచున్నది. 6వ నామమున ఉదయించుచున్న వేయి సూర్యులకాంతి కలదిగ శ్రీదేవిని స్తుతించుట జరిగినది. ఉదయించు సూర్యుడు ఎఱ్ఱనిరంగు కలవాడు కదా!

ఆసలామెయే అగ్నిగుండము నుండి పుట్టినదని 4వ నామము తెలుపుచున్నది. అంతవరకేల ధ్యాన శ్లోకమే 'అరుణాం' అని మొదలగును. ఇకముందు నామములలో గూడ అరుణ వర్ణము మరల మరల తటస్థించును. అరుణము ఇచ్ఛాశక్తి సంకేతము. ఆమె ఇచ్ఛాశక్తి వలననే సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవి. అందుచే ఆరాధకులు ఎల్లని పుష్పములు, ఎఱ్ఱని మణులు, ఎఱ్ఱని వస్త్రములు, ఎఱ్ఱని కుంకుమతో ఆరాధన చేయుట శ్రేష్ఠము. 'సర్వారుణ' కావున ఎచ్చట ఎరుపురంగు చూచినను ఆమె అస్థిత్వమును గుర్తించుట సత్సాధన.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 49 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 49. Sarvāruṇā सर्वारुणा (49) 🌻

Sarvam + aruṇam = everything in red. Everything associated with Her is red. This fact has been highlighted in various nāma-s. Saundarya Laharī (verse 93) says karuṇā kācid aruṇā meaning that Her compassion which is red in colour is beyond comprehension. The same nāma is in Lalitā Triśatī (138). Yajur Veda ‘saysasau yastāmro aruṇa uta babhruḥ sumangalaḥ’ (this comes under Śrī Rudraṁ 1.7) which says that aruṇa (the colour of the sun at the time of dawn) is copper red in colour which is auspicious. ‘The colour of red is auspicious’ says Śruti (Veda-s). No other authority is needed to ascertain Her complexion.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



23 Oct 2020

No comments:

Post a Comment