భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 80


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 80 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 02 🌻


338. సంభవ అస్థిత్వము :- సూక్ష్మగోళము పంచ ఆవిష్కరములలో ఒకటి. ఇది దేవతలు, పితరులతో కూడియుండును.

ప్రణామయభువనము, నాల్గవ ఆవిష్కరము.

సూక్ష్మగోళము మనోమయ గోళము నుండి తన ఉనికిని పొందుచున్నది.

ఇచ్చట భగవంతుని అతను ఆవిష్కార విశేషములకు గల సంబంధము - తండ్రికి అతని సంతానమునకు గా సంబంధము వంటిది. ఇచ్చట భగవంతఁడు దయాళువు, కరుణామయుడు. తన సంతానమువల్ల ఏమరువకయుండును. వీరు శిక్ష బహుకృతులందు ఆలోచన, జ్ఞానశక్తి, ఆధ్యాత్మిక సిద్ధికొరకు ప్రయాసలేనట్టి ఉపేక్షాపరులు, వీరే దేవతులు.

ఇచ్చట భగవంతునితో గల సంబంధము సక్రియాత్మక ఐక్యం (అనగా భగవంతుని సంకల్పము లేనిదే వీరు ఏపని చేయరు. భగవత్సంకల్ప స్వరూపులు దేవతలు).

వీరు భగవంతుని స్తుతించుట ద్వారా స్మృతికి తెచ్చుకొని కార్యములో ఏకాంతవాసులై తీరిక లేక యుందురు.

నోట్ : సూక్ష్మ గోళము 1, 2, 3, 4, భూమికలకు సంబంధించినది.

ఆధ్యాత్మికంగా సూక్ష్మమనగా - కేవలము భౌతికమునకు అన్యమైనది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam


🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom



23 Oct 2020

No comments:

Post a Comment