నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 - 14. అన్ని విజ్ఞాన శాస్త్రాల వెనుక ఉన్నవారు మీరే / DAILY WISDOM - 319 - 14. You Yourself are Something Behind Science
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 319 / DAILY WISDOM - 319 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 14. అన్ని విజ్ఞాన శాస్త్రాల వెనుక ఉన్నవారు మీరే🌻
ఆధునిక పరమాణు శాస్త్రం సాధారణ గణిత గణనల పరంగా కొలవదగినది కాదు. గణితం మరియు తర్కం పనిచేయని తలంలో జీవిత విలువలన్నీ తారుమారు అవుతాయి. ఈ స్థితిలో, విజ్ఞాన శాస్త్రం కూడా పనిచేయదు. మీరు ఆ పరిమితిని దాటినప్పుడు, అది మెటాఫిజిక్స్ అంటే తత్వశాస్త్రం అవుతుంది. ఇది భౌతిక శాస్త్రం కాదు, భూగర్భ శాస్త్రం కాదు. ఇది తరువాత మెటా-జియాలజీ అంటే మన శాస్త్రాలకు ఆవల ఉన్న విజ్ఞానం అవుతుంది. ఎందుకంటే మన శాస్త్రాలకు ప్రామాణికమైన కొలత, పరిశీలన, గణన కొన్ని రంగాలలో వర్తించవు. మీరు మొత్తం వ్యక్తిగా ఇక్కడ కూర్చున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు చిన్న భాగాలతో రూపొందించ బడినప్పుడు మీరు మొత్తం ఒక వ్యక్తి అని ఎలా భావించగలరు?
మీకు చెవులు, కళ్ళు, ముక్కు, ఎముకలు, మాంసం, గుండె మరియు ఊపిరితిత్తులు ఉన్నాయి. మీరు అనేక చిన్న విషయాల కలయిక అని మీకు ఎందుకు అనిపించదు? ఇక్కడ ఎవరు కూర్చున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నట్లు చెప్పకూడదు; ఇక్కడ చిన్న రేణువుల సమూహం ఉందని మీరు చెప్పాలి. మీకు అలా ఎందుకు అనిపించడం లేదు? ఇక్కడ మీరే శాస్త్రానికి పూర్తిగా అర్థం కారు. మీ అస్తిత్వమే విజ్ఞానశాస్త్రం యొక్క గణన ప్రక్రియకు అందడం లేదు. అలా కాకుండా, మిమ్మల్ని మీరొక కొలవదగిన విషయంగా అభివర్ణించ గలిగితే, మిమ్మల్ని ఒక అంగాల సమూహంగా, కొన్ని ప్రక్రియల సమూహంగా వర్నించు కోవాలి తప్ప ఫలానా వ్యక్తి అని కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 319 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 14. You Yourself are Something Behind Science 🌻
Modern subatomic science is not measurable in terms of ordinary mathematical calculations. All the values of life get negatived in a realm where mathematics and logic do not operate. In this condition, science also will not operate. When you cross that limit, it becomes metaphysics. It is not physics any more; it is not geology. It becomes meta-geology afterwards, because any kind of measurement, observation and calculation cannot apply in certain realms. You are feeling that you are sitting here as a whole person, but how should you feel that you are one whole total being when you are made up of little parts?
You have got ears and eyes and nose and bone and flesh, heart and lungs. Why don't you feel that you are an assemblage of so many little things? Who is sitting here? You should not say that you are sitting here; you should say that here is a bundle of little particles. Why don't you feel like that? Here you yourself are something behind science. Your very existence as so-and-so defeats the calculative process of science. Otherwise, if it is an observable, measurable thing that you are, then you have to describe yourself as an anatomical and physiological entity, and not so-and-so.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
02 Aug 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment