🌹 11, SEPTEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 11, SEPTEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹11, SEPTEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 787 / Sri Siva Maha Purana - 787 🌹
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 5 / The fight between the Gaṇas and the Asuras - 5 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 40 / Osho Daily Meditations  - 40 🌹
🍀 40. పనిలో ఉండడం / 40. AT WORK 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -2 🌹 
🌻 484. 'డాకినీశ్వరీ' - 2 / 484. 'Dakinishwari' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 11, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 47 🍀*

*95. ఆరోహణోఽధిరోహశ్చ శీలధారీ మహాయశాః |*
*సేనాకల్పో మహాకల్పో యోగో యోగకరో హరిః*
*96. యుగరూపో మహారూపో మహానాగహనో వధః |*
*న్యాయనిర్వపణః పాదః పండితో హ్యచలోపమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పూర్ణానుమోదం - మనోమయ చేతనలోని భావాల వల్ల, ప్రాణమయ చేతనలోని కామనల వల్ల, అన్నమయ చేతనలోని స్తబ్ధత వల్ల పూర్ణానుమోదం దీర్ఘకాలం పట్టవచ్చు. ఈశ్వర శక్తి సహాయాన్నే సాధకుడు వీటిని తొలగించుకోడానికి అర్థించాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 23:53:17
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: పుష్యమి 20:01:30
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: పరిఘ 24:14:28 వరకు
తదుపరి శివ
కరణం: కౌలవ 10:40:11 వరకు
వర్జ్యం: 02:05:00 - 03:52:36
దుర్ముహూర్తం: 12:37:20 - 13:26:34
మరియు 15:05:02 - 15:54:16
రాహు కాలం: 07:35:46 - 09:08:05
గుళిక కాలం: 13:45:01 - 15:17:20
యమ గండం: 10:40:24 - 12:12:43
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 12:50:36 - 14:38:12
సూర్యోదయం: 06:03:28
సూర్యాస్తమయం: 18:21:58
చంద్రోదయం: 02:48:18
చంద్రాస్తమయం: 16:16:40
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 20:01:30 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 12 🌴*

*12. దివి దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |*
*యది భా: సదృశీ సా స్యా ద్భాసస్తస్య మహాత్మన: ||*

*🌷. తాత్పర్యం : లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు.*

*🌷. భాష్యము : అర్జునుడు గాంచిన విషయము వర్ణణాతీతమైనది. అయినను సంజయుడు ఆ అద్భుతము యొక్క మనోచిత్రణను ధృతరాష్ట్రునకు తెలుప యత్నించుచున్నాడు. సంజయుడుగాని, ధృతరాష్ట్రుడుగాని యుద్ధరంగమున లేకున్నను వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు జరిగినదంతయు యథాతథముగా గాంచగలిగెను. కనుకనే అతడు అచ్చటి పరిస్థితిని సాధ్యమైనంతవరకు అవగతమగునట్లు వేలాదిసూర్యులు ఉదయించుట వంటి ఊహాత్మక భావములతో పోల్చుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 426 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 12 🌴*

*12. divi sūrya-sahasrasya bhaved yugapad utthitā*
*yadi bhāḥ sadṛśī sā syād bhāsas tasya mahātmanaḥ*

*🌷 Translation : If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.*

*🌹 Purport : What Arjuna saw was indescribable, yet Sañjaya is trying to give a mental picture of that great revelation to Dhṛtarāṣṭra. Neither Sañjaya nor Dhṛtarāṣṭra was present, but Sañjaya, by the grace of Vyāsa, could see whatever happened. Thus he now compares the situation, as far as it can be understood, to an imaginable phenomenon (i.e., thousands of suns).*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 787 / Sri Siva Maha Purana - 787 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*

*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 5 🌻*

*మహేశ్వరుడిట్లు పలికెను- దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ విష్ణూ! నా మాటను నీవు శ్రద్ధతో వినుము. మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను (35). నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళ్లుము. ఆ రాక్షసరాజు హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా నిర్భయముగా నిశ్చయముగా తమ స్థానములకు వెళ్లెదరు గాక! (36).*

*సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు గల వాడై దేవతలతో గూడి తన స్థానమునకు శీఘ్రముగా చేరుకొనెను (37). ఓ వ్యాసా! ఇంతలో మహాపరాక్రమ శాలి, బలశాలి అగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్ధులైన రాక్షసులతో గూడి కైలాసపర్వత సమీపమునకు చేరెను (38). యమునితో సమమగు ఆ జలంధరుడు పెద్దసేనతో గూడిన వాడై కైలాసమును ముట్టడించి సింహనాదమును చేయుచూ ఉత్కర్ష గల వాడై స్థిరముగా నుండెను (39). గొప్ప లీలలు గలవాడు, దుష్టసంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదమునుండి బయల్వెడలిన ఆ కోలాహలమును విని అపుడు మిక్కిలి కోపించెను (40). గొప్ప లీలలు గలవాడు, యుద్ధమునందు ఉత్సాహము గలవాడు, పాపహారి అగు మహాదేవుడు మహాబలశాలురగు నంది మొదలైన తన గణములను యుద్ధమునకు ఆదేశించెను (41). నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరు శివుని ఆజ్ఞచే మిక్కిలి వేగముతో యుద్ధమునకు సన్నద్ధులైరి. (42). క్రోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులగు గణములందరు సింహనాదములను చేయుచూ యుద్ధము కొరకై కైలాసమునుండి క్రిందకు దిగిరి (43).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 787 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*

*🌻 The fight between the Gaṇas and the Asuras - 5 🌻*

The great lord Śiva said:—
35. O Viṣṇu, foremost among the gods, please listen to my words attentively. I will kill the great Daitya Jalandhara. There is no doubt about this.

36. Go back to your abode fearlessly. Let the gods too go back without fear and hesitation, considering the ruler of the Asuras already killed.

Sanatkumāra said:—
37. On hearing the words of lord Śiva, the lord of Lakṣmī immediately went to his abode without doubts along with the gods.

38. In the meantime, O Vyāsa, that valorous king of the Daityas went along with the well-equipped Asuras to the outskirts of the mountain.

39. Accompanied by a vast army he laid siege to Kailāsa. He stood there like the god of death roaring like a lion.

40. On hearing the tumultuous roar of the Daityas, lord Śiva of great sports, the destroyer of the wicked, became very furious.

41. The great lord of various sports, the enthusiastic Śiva commanded his powerful Gaṇas, Nandin and others, severally.

42. Nandin, Vighneśvara, Kumāra and all other Gaṇas, at the bidding of Śiva hurriedly got ready for the battle.

43. The infuriated and invincible Gaṇas descended from Kailāsa heroically shouting war cries and leaping to fight.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 40 / Osho Daily Meditations  - 40 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 40. పనిలో ఉండడం 🍀*

*🕉 పనిలో సహచరులుగా ఉన్న వ్యక్తులు మీ అంతరంగిక విషయాల గురించి అస్సలు పట్టించుకోరని గుర్తుంచుకోవాలి. అది మీ పని; వారు పని చేయడానికి వారి స్వంత అంతర్గత జీవితాలను కలిగి ఉన్నారు. 🕉*

*మీ సహోద్యోగులకు మీతో సహా ప్రతి ఒక్కరికి ఉన్నట్లే వారి స్వంత ప్రతికూల మానసిక స్థితి, వారి స్వంత వ్యక్తిగత సమస్యలు మరియు ఆందోళనలు ఉంటాయి. కానీ మీరు ఎవరితోనైనా పని చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు ఈ విషయాలను తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు వారి ప్రతికూలతలను తీసుకురావడం ప్రారంభిస్తే మరియు మీరు మీ అన్నింటిని తీసుకురావడం ప్రారంభిస్తే, అది ఎప్పటికీ అంతం లేని ప్రక్రియ. మీకు ప్రతికూలంగా అనిపిస్తే, ఏదైనా చేయండి. ఉదాహరణకు, చాలా ప్రతికూల విషయం వ్రాసి దానిని కాల్చండి. థెరపీ గదికి వెళ్లి, ఒక దిండు కొట్టి విసిరేయండి. భయంకరమైన నృత్యం చేయండి! మీరు దాన్ని సంభాలించుకోoడి; ఇది మీ సమస్య.*

*మీతో పని చేస్తున్న వారితో మీరు ప్రతికూలంగా ఉన్నారా, వారు బాధపడ్డారా అని మధ్య మధ్యలో అడగడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ప్రతికూలంగా ఉన్నారని మీకు తెలియకపోవచ్చు. చిన్న సంజ్ఞలు, కేవలం ఒక మాట, ఒక మౌనం కూడా బాధ కలిగించవచ్చు; మీరు ఒకరిని చూసే విధానం బాధ కలిగించవచ్చు. కాబట్టి మధ్య మధ్యలో వారిని క్షమించమని అడగండి. వారికి చెప్పండి, 'నేను మిమ్మల్ని అడిగిన ప్రతిసారీ, మీరు నిజాయితీగా ఉండాలి. నాకు చెప్పండి, ఎందుకంటే నేను మనిషిని మరియు కొన్నిసార్లు నా వైపు నుండి తప్పు జరగవచ్చు. నేను వాటిని సరిదిద్దాలి.'*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 40 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 40. AT WORK 🍀*

*🕉  One has to remember that the people who are associates at work are not at all concerned with your inner lye. That is your work to do; they have their own inner lives to work out.  🕉*

*Your work colleagues have their own negative moods, their own personal problems and anxieties, just as everybody else, including you, has. But when you are in a working situation with somebody, you need not bring these things in, because if they start bringing in all their negativities and you start bringing in all of yours, it will be a neverending process. If you are feeling negative, do something. For example, write out a very negative thing and burn it. Go to the therapy room, beat a pillow and throw it. Do a terrible dance! You have to work it out; it is your problem.*

*And once in a while it is good to ask whoever is working with you whether you have been negative, if they are feeling hurt. Because sometimes you may not know that you have been negative. Small gestures, just a word, even a silence, can be hurtful; the way you look at someone can be hurtful. So once in a while ask their forgiveness. Tell them, "Every time I ask you, you have to be honest. Just tell me, because I am a human being and sometimes things can go wrong from my side and I have to put them right."*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 484 -2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।*
*అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀*

*🌻 484. 'డాకినీశ్వరీ' - 2 🌻*

*పరమాత్మ, జీవాత్మ, పంచభూతములు అను సప్తమ కేంద్రములను శ్రీమాతయే తన యోగ శక్తిచే నిర్మాణము గావించి ఆయా లోకముల నేర్పరచి, ఆయా ప్రకృతి ధర్మములను ప్రవేశింపజేసి, ఆయా లోకశక్తుల నేర్పరచి, ఆయా రూపములను ధరించి శ్రీమాత వసించుచున్నది. ఇందలి ప్రజ్ఞా కేంద్ర వర్ణనము యోగమున వ్యాసము చేయుట సంప్రదాయము. ప్రతి ప్రజ్ఞా కేంద్రమందు ఆ కేంద్రీకమలమును, అందు ఆశీనురాలైన శ్రీమాతను, ఆమె రూపమును, ఆమె ధరించియున్న శక్తులను, ఆమె పొందియున్న కాంతిని, ఆమె నామమును న్యాసము చేసి యోగించుట కొరకు ఈ న్యాసము ఈయబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 484 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari*
*amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻*

*🌻 484. 'Dakinishwari' - 2 🌻*

*With her yogic power, Sri Mata constructed The seven centers of Paramatma, Jeevatma and Panchabhuta and structured the respective worlds, introduced the nature's virtues, set up the powers for those worlds, and resides in respective forms in those worlds. It is customary in yoga to write essays on the pragnya kendra. In every prajna kendra, this nyasa is performed in order to meditate on that central lotus, that Sri Mata, her form, the powers she wears, the light she has received, and her name.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment