🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 138 / DAILY WISDOM - 138 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 17. తత్వశాస్త్రం యొక్క విలువ 🌻
తత్వశాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క తార్కిక అధ్యయనం లేదా వివిధ శాస్త్రాల సంశ్లేషణ మాత్రమే కాదు. దీని పద్ధతులు విజ్ఞాన శాస్త్రానికి భిన్నంగా ఉంటాయి. కానీ, విషయాలను ఉన్నతంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం యొక్క సంపూర్ణ సారాంశాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే స్వామి శివానంద విజ్ఞాన శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడరు, అయినప్పటికీ, ఆధునిక మనిషికి తత్వశాస్త్రంలోని గొప్ప సత్యాలను బోధించే ఉద్దేశ్యంతో, విజ్ఞాన శాస్త్రం పరిమితుల నుండి మరియు ఆధునిక అవసరాల నుండి దృష్టాంతాలను తీసుకోవడానికి ఆయనకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంద్రియ గ్రహణశక్తికి మించిన వాస్తవికత ఉనికిని విజ్ఞాన శాస్త్రం అంగీకరించదు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు.
తత్వశాస్త్రం తన విలువను ప్రధానంగా స్వీయ విచారణలోనూ మరియు పరమాత్మపై ధ్యానించడంలోనూ అది పోషించే ప్రధాన పాత్ర వల్ల సంతరించుకుంటుంది. తత్వశాస్త్రాన్ని కేవలం హేతువాద పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణలో ఉపయోగిస్తే అది పనికిరానిదిగా తను భావిస్తాడు. జ్ఞాన యోగ మార్గంలో ఆధ్యాత్మిక ధ్యానం యొక్క పునాదిగా, తత్వశాస్త్రం యొక్క విలువ లెక్కించలేనిది. ఇది రాజయోగం, భక్తి యోగం మరియు కర్మ యోగం యొక్క మార్గాల వెనుక ఉన్న కారణాలను కూడా అందిస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 138 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 17. The Value of Philosophy 🌻
According to Swami Sivananda, philosophy is not merely a logical study of the conclusions of science or a synthesis of the different sciences. Its methods are different from those of science, though, for purposes of higher reflection and contemplation, it would accept the research of science and its accumulated material. Swami Sivananda, however, is not inclined to give too much importance to science, though, for purposes of instructing the modern man in the great truths of philosophy, he has no objection to taking illustrations from the limitations of science and from the necessity that modern science feels for accepting the existence of a reality beyond sense-perception.
To Swami Sivananda, the value of philosophy rests mainly in its utility in reflective analysis and meditation on the Supreme Being. Philosophy in the sense of a mere play of reason he regards as useless in one’s search for spiritual knowledge. As a necessary condition of spiritual meditations on the path of Jnana Yoga, the value of philosophy is incalculable. It also provides the necessary prop for and gives the rationale behind the paths of Raja Yoga, Bhakti Yoga and Karma Yoga.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment