శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 350 / Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 350. 'వాగ్వాదిని' 🌻
వాక్కులను పలుకునది శ్రీమాత అని అర్థము. వాక్కు నాలుగు శ్రుతులలో నున్నది. పరా వాక్కుగ నుండు శ్రీదేవి నుండి వచ్చు సంకల్పము పశ్యంతి అగుచున్నది. అనగా ఏమి లేనట్టు వున్నట్టి స్థితి నుండి సంకల్ప స్థితికి వచ్చుట. సంకల్పము కలుగుటయే యుండును గాని ఎవ్వరునూ సంకల్పించలేరు. సంకల్పము కలిగినపుడు దానిని గ్రహింతురు. అనగా దర్శింతురు. ఇట్లు దర్శన స్థితిలోనికి వచ్చిన పరావాక్కే పశ్యంతి. అటుపైన భాష ననుసరించి మధ్యమ వాక్కుగ నేర్పడి కంఠము ద్వారా వైఖరిగా నాలుకమీదుగ వెలువడును.
సంకల్పము కలుగుట, దానిని దర్శించుట, దర్శించిన దానికి భాష నేర్పరచుట, ఆ భాషను పలుకుట ఇది నిత్య జీవితమున కలుగు విచిత్రము. అందరునూ ఈ విధముగనే పలుకుచున్నారు. కాని వారు పలుకుటకు ఆధారమైన సంకల్పము, భాష, వాక్పటిమ శ్రీదేవియే అని తెలియలేరు. ఇట్లు వాక్కు రూపమున అంతర్యామిత్వము చెంది శ్రీదేవి జీవుల కార్యములను చక్కబెట్టుచున్నది. ఆమెయే ఋగ్వేద దేవత. వాగ్గేవత. ' వాగేవ ఋగ్వేదః' అని ఉపనిషత్తు తెలుపుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 350 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 350. Vāgvādinī वाग्वादिनी 🌻
She prompts speech or She is in the form of speech itself. Goddess Sarasvatī is referred to as the goddess of speech. This nāma could mean that Sarasvatī acquired the control of speech from Her (like allocation of portfolios in a government). Since She is the origin of speech, She is Vāgvādinī.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment