శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 390 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 390-3🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀
🌻 390. 'నిర్వాణ సుఖదాయిని' - 3 🌻
శ్రీకృష్ణుడు అనగా యోగీశ్వరులకు కూడ ఈశ్వరుడు. అతనికి శరీరము ఉపాధానము (పనిముట్టు) మాత్రమే. అతడు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మధారి యైన శ్రీ మహావిష్ణువు. భూనభోంతరాళముల వ్యాపించిన యజ్ఞపురుషుడు. అతడికి శరీర మొక ఉపాధి. అతడు శరీరము నందు ఉండుట, లేకుండుట ఏక కాలమున నిర్వర్తించిన వాడు. కృష్ణ తత్త్వ మనగా శ్రీమాత తత్త్వమే అని పలుమార్లు వివరింప బడినది.
శ్రీమాత కూడ సమస్తము వ్యాపించి ఉపాధి ద్వారా ఉపాసకులకు దర్శన మిచ్చు చుండును. శ్రీమాత తన భక్తుడైన హిమవంతుని ఉద్దేశించి యిట్లు పలికెను : “నీవు నన్ను విడచి నిర్మలమైన నిర్వాణ పదమును పొందజాలవు. కావున నన్నే శరణు పొందుము. నేను ఏక కాలమున రూపిగ, అరూపిగ కూడ నుందును. ఇందేది తిరస్కరించిననూ నీకు పరిష్కారము లేదు.” ఈ నామము ఒక అద్భుతమగు రహస్యము. ఇది తెలిసిన వారే పూర్ణ సుఖమును పొందగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 390 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻
🌻 390. Nirvāṇa-sukha-dāyinī निर्वाण-सुख-दायिनी -3 🌻
Nir (freed) + vāṇa (derived from bāṇa, meaning body). When mind is freed from body, it leads to bliss. When higher level of consciousness is reached, physical body is forgotten. When bodily afflictions are dissolved, what is derived is eternal bliss. She confers this bliss to those who worship Her as per nāma-s 381 and 382.
This stage is described by Kṛṣṇa “He who is happy within, who rejoices within, he obtains Absolute Freedom or mokṣa. Only that yogi who possesses the inner bliss, who rests on the inner foundation, who is one with inner light, becomes one with Spirit. With sins obliterated, doubts removed, senses subjugated, the sages contributing to the welfare of the mankind, attain emancipation in the Brahman”. (Bhagavad Gīta V.24 and 25)
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
28 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment