✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నీ సొంత అనుభవానికి వచ్చినపుడే సత్యం నిజమైన సత్యమవుతుంది. దానిని ఎవరూ నీకు యివ్వలేరు. నీలోపలికి వెళ్ళాలి. నీ అస్తిత్వం లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీకది కనిపిస్తుంది. 🍀
సత్యాన్ని కొనలేం. యితరుల్ని అందుకోలేం. అది మార్పిడి వస్తువు కాదు. వ్యక్తి తనంగా తాను దాన్ని కనిపెట్టాలి. ధనంతో కొనలేం. అధికారంతో కొనలేం. వ్యక్తి తన లోపలికి వెళితే దాన్ని కనిపెడతాడు. అదప్పటికే అక్కడుంది. దాన్ని కొనలేం. చిత్రమేమిటంటే ప్రతి ఒక్కడూ దాన్ని కొంటాడు. ఒక సంగతి గుర్తుంచుకోవాలి. నువ్వు కొన్న దేదయితే వుందో అదంతా సత్యానికి సంబంధించిది. కానీ సత్యం కాదు. నువ్వు కొన్నది కేవలం పదాల్ని. నీ సొంత అనుభవానికి వచ్చినపుడే సత్యం నిజమైన సత్యమవుతుంది. దానిని ఎవరూ నీకు యివ్వలేరు. కారణం అది అప్పటికే నీ దగ్గర వుంది. నీలోపలికి వెళ్ళాలి. నీ అస్తిత్వం లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీకది కనిపిస్తుంది.
అది కొనగలిగే సరుకు కాకపోవడం మంచిదయింది. అది నీకు ఎవ్వరూ యివ్వలేక పోవడం మంచిదయింది. అట్లా అయితే అది విలువ లేనిదయ్యేది. జనాలకు తల్లిదండ్రుల్నించీ ఆస్తి సంక్రమిస్తుంది. జనం వాళ్ళ వీలునామాలో 'సగం సత్యాన్ని నా భార్యకు, నా గర్ల్ ఫ్రెండ్కు తక్కిన సగం సత్యాన్ని నా పిల్లలకు సమంగా పంచాలి' అని రాసేవాళ్ళు. అట్లా వీలుకాకపోవడం మంచిదే అయింది. అది కేవలం వ్యక్తిగతం. అది కేవలం నీ ఏకాంతంలోనే నీ అనుభవానికి వస్తుంది. అది నీ లోపలి కాంతి, నీ నిజమైన ఆలయం. అది అక్కడ నీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
19 Jul 2022
No comments:
Post a Comment