నిత్య ప్రజ్ఞా సందేశములు - 312 - 7. వస్తువుతో విలీనం అవ్వాలనే కోరిక / DAILY WISDOM - 312 - 7. The Desire to Merge with the Object


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 312 / DAILY WISDOM - 312 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 7. వస్తువుతో విలీనం అవ్వాలనే కోరిక 🌻


ఒక వ్యక్తి ఒక వస్తువును కోరుకున్నప్పుడు, దానితో ‘ఒకటిగా మారడం’ అనేది సూక్ష్మమైన కోరిక. అందుకే మీరు కోరుకునే వస్తువు దగ్గరలో ఉందని వింటే, మీరు సంతోషంగా ఉంటారు. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు, మరియు మీరు దానిని చూడగలిగినప్పుడు, ఆనందం పెరుగుతుంది; అది ఇంకా దగ్గరగా వస్తున్నప్పుడు, మరింత ఆనందం వేస్తుంది. మీరు దానిని తాకినప్పుడు, అది ఇంకా ఎక్కువగా ఉంటుంది, కానీ అది కూడా సరిపోదు. దురదృష్టవశాత్తు, మీరు ఆ స్థాయిని దాటి వెళ్ళలేరు. మీరు కోరిన వస్తువును తాకవచ్చు, కానీ మీరు దాని ఉనికిలోకి ప్రవేశించి మమేకం అవలేరు. అందుకే కోరుకున్న వస్తువులతో పాటు వాటి పట్ల వియోగం, బాధ, మరణం, పుట్టుక మొదలైన భావాలు కూడా ఉంటాయి.

అసలు కోరిక ఏమిటంటే, వస్తువు మీ ఉనికిలో కరిగి పోయేలా చేయడం. మీరు దాని వెలుపల నిలబడటానికి ఇష్టపడరు. మీరు శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటారు, కానీ బయట ఉన్న స్థూల జగత్తు, వస్తువు మీలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఎందుకంటే ప్రతి వస్తువు స్వతంత్రంగా ఉంటుంది; కాబట్టి, అది మీ ఆస్తి ఎలా అవుతుంది? దేనిపట్లైనా యాజమాన్యత అనేదేమీ లేదు. ఇది ఒక మూర్ఖపు ఆలోచన, కానీ వాస్తవానికి, ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ వస్తువు యొక్క స్వయంతో మిమ్మల్ని మీరు విలీనం చేసుకోవడం, తద్వారా రెండు స్వయాలు పెద్ద పరిమాణంలో ఒక స్వయంగా మారతారు. ఇలా ఆత్మలన్నీ కలిసి విలీనమై పోతే, అది ఇంకా పెద్దగా అనంతంగా అవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 312 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 7. The Desire to Merge with the Object 🌻


Even when a person desires a thing, the subtle desire is to ‘become one' with it. That is why if you hear that your object of desire is nearby, you feel happy. When it comes near, and you can see it, the joy increases; and when it is coming nearer still, there is more joy. When you touch it, it is still more, but even that is not sufficient. You cannot, unfortunately, go beyond that. You can touch an object of desire, but you cannot enter into it. That is why there is bereavement, suffering, death, birth, following desires.

The ultimate desire is to make the object melt into your being. You do not want to stand outside it. You want perpetual enjoyment, but the space-time complex which is outside prevents the object from entering into you because every object is independent; so, how can it become your property? There is no such thing as possessing anything. It is a foolish idea, but actually, the intention is to merge yourself with the self of that object, so that the two selves become one self of a bigger size. If all the selves melt together, it becomes a larger self.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Jul 2022

No comments:

Post a Comment