🌹 కార్తీక మాసం.. నవంబర్ 6.. ఈ చిన్న పని చేస్తే చాలు..! అంతులేని సంపదలు, పదవులు ఖాయం..! 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Karthika month.. November 6.. Just do this small task..! Endless wealth and positions are guaranteed..! 🌹
Prasad Bharadwaja
కార్తీక మాసంలో 16వ రోజు ఎలాంటి శక్తిమంతమైన విధివిధానాలు పాటిస్తే సంపదలు, అధికార పదవులు అద్భుతంగా కలుగుతాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్ల పక్షానికి ఎంత శక్తి ఉందో బహుళ పక్షానికి కూడా అంతే శక్తి ఉంది.
పౌర్ణమికి ముందు చేసే పూజలకు ఎంత శక్తి ఉందో పౌర్ణమి తర్వాత కూడా చేసే పూజలకు అంతే శక్తి ఉంది. కార్తీక బహుళ పాడ్యమి తిథి.. కార్తీక మాసంలో 16వ రోజు.. నవంబర్ 6వ తేదీ.. గురువారం.. కొన్ని ప్రత్యేక విధివిధానాలు పాటిస్తే సంపదలు, పదవులు రెండూ సిద్ధింపజేసుకోవచ్చు.
కార్తీక మాసంలో 16వ రోజున ప్రతి ఒక్కరు చేయాల్సిన పని.. ఆలయంలో సమ్మార్జన (సమార్జనం) చేయాలి. అంటే ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, తుడవటం, అక్కడ ముగ్గులు పెట్టటం. మీ దగ్గరలో ఉన్న శివాలయం లేదా విష్ణువు ఆలయానికి వెళ్లి చీపురుతో చిమ్మి, తడబట్ట పెట్టి తర్వాత ముగ్గులు వేయాలి. ఇలా శివాలయంలో చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి. విష్ణువు ఆలయంలో చేస్తే అధికార పదవులు కలుగుతాయని కార్తిక మహత్యం తెలుపుతుంది. ప్రమోషన్లు రావాలన్నా, రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా, సంఘంలో మంచి పదవులు రావాలన్నా విష్ణువు ఆలయంలో ఈ పని చేయాలి. ధన పరంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే విపరీతంగా ధనం రావాలంటే శివాలయంలో ఈ పని చేయాలి.
శివాలయంలో కనిపించే ఆకాశ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఆకాశ దీపాన్ని చూడగానే నమస్కారం చేసుకుని, ప్రార్ధన చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ దేవాలయానికి ఇవ్వాలి. అలా ఇచ్చిన వారు సాక్ష్యాత్తు నందీశ్వరుడితో సమానం అవుతారని కార్తీక మహత్యం తెలుపుతుంది. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి అంటే కార్తీక మాసంలో 16వ రోజున శివాలయంలో ఆకాశ దీపం వెలిగించే నిమిత్తం నూనె కానీ నెయ్యి కానీ ఇస్తారు వారు నాతో సమానమైపోయిన వాళ్లు అవుతారని, శివుడు నన్ను ఎంతగా అనుగ్రహిస్తాడో వారిని కూడా అంతగానే అనుగ్రహిస్తాడని నందీశ్వరుడు స్వయంగా సెలవిచ్చాడు.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment