మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 14
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 14 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚. ప్రసాద్ భరద్వాజ
భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడు ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ సృష్టులే మూడు లోకములు. జీవుల దేహములు కూడ ఈ మూడు లోకములందు సృష్టింపబడును.
మన దేహమునందున్న భౌతిక పదార్థము భూలోకము. దానిని కదలించు ప్రాణశక్తి భువర్లోకము. దానిని గమనించు మనస్సు మున్నగునవి స్వర్లోకము.
ఈ మూడును దేహము విడుచుకాలమున నశించును. అంతర్యామి యందుండు వాడు నశింపక ఈ మూడిటి ప్రళయమును గమనించును.
అట్లుగాక ఈ మూడింటిలో దేనియందో మెలగుచున్న ప్రజ్ఞ కలవాడు సంసార బద్ధుడనబడును. అట్టివాడు మృత్యువును పొందును. అనగా దేహాదులు పోవుటకు ముందే తెలివి తప్పిపోవును.
ఇట్లే ఒక భూగోళము యొక్క ప్రళయము, ఒక సౌరకుటుంబము యొక్క ప్రళయము , ఒక బ్రహ్మాండము యొక్క ప్రళయము కూడ వర్ణించబడినది.
భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment