శివగీత - 17 / The Siva-Gita - 17

Image may contain: 2 people
🌹. శివగీత  - 17  / The Siva-Gita - 17  🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 1 🌻

అగస్త్య ఉవాచ:
న గృహ్ణాతివచ : పధ్యం - కామ క్రో ద్రూది పీడితః,
హితం న రోచతే తస్య - ముమూర్షో రివ భేషజమ్. 1

మధ్యే సముద్రం యానీతా - సీతా దైత్యేన మాయినా,
ఆయాస్యతి నారా శ్రేష్ఠ! - సాకధం తవ సన్నిధిమ్. 2

అగస్త్యుడు పలుకుచున్నాడు:

కామ క్రోధా ద్యరి షడ్వర్గంబుల కదీనుడైన వాడు నీతి  వచనములకు బెడ చెవిని పెట్టును. మరణమును కోరుకున్న మనిషి మంచి మందును పుచ్చుకొనుట సమ్మతించడు.

 అట్లే ఓ రామా! నీ ధర్మపత్ని యగు సీత మాయావి యైన  రావణుని చేత అపహరింప బడి సాగర మధ్యన ఉంచ బడినది. అటువంటి నీ భార్య నీ చెంత కెట్లు రాగలదు?

భద్యన్తే దేవతా స్సర్వా - ద్వారి మర్కట యూధవత్,
కించ చామర ధరిణ్యో - యశ్శం భువర దర్పితః 3

భుంక్తే త్రిలోకీ మఖిలాం- యశ్శం భువర దర్పితః,
నిష్కంటకం తస్య జయః - కధం తన భవిష్యతి? 4

ఎవని భవన ప్రాంగణమున వానరుల గుంపు వలె దేవతలు బంధింప బడినారో, ఆ దేవతల యొక్క భార్యలు వింజా  మరములను చేత బూని గాలి వేయుచున్నారో మరియు నెవడైతే మహేశ్వర వరమును బొంది గర్వముతో స్వర్గ మర్త్య పాతాళ లోకములను నిరాటంక ముగా బరిపాలించు చున్నాడో,  అటువంటి రావణాసురుని పరాభవింప చేయుట నీ తరమా?

ఇంద్ర జిన్నా మమ పుత్రోయ - స్తస్యా స్తీశ వరోద్దతః,
తస్యాగ్రే సంగరే దేవా - బహువారం పలాయతాః 5

కుంభ కర్ణా హ్వయో భ్రాతా - యస్యాస్తి సుర సూదనః,
అన్యోది వ్యాస్త్ర సంయుక్త - శ్చిరం జీవీ విభీషణః 6

మరియు (పోగా ) నాతనికి ఇంద్రజిత్తు డనే కుమారుడున్నాడు.  అతడు పరమశివుని వరము చేత మహా బలశాలియై యింతవరకు దాను పరాభావమన నెట్టిదో ఎరుగడు.

అటువంటి యోధుని ఎదుట నిలిచి యుద్దము చేయుటకు శక్తి లేక యుద్ద భూమి నుండి అనేక సార్లు దేవతలు పలాయనము జిత్తగించిరి. 
అది యట్లుండగా సుపర్వ గర్వము నణచి వేసిన కుంభకర్ణుండు  అతనికి తోబుట్టువు. 

మరియు దివ్యాస్త్రములతో సంసిద్దుడై యుండిన చిరంజీవి యగు విభీషణుడు కూడా అతనికి అనుంగ సోదరుడే.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 The Siva-Gita - 17 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga  - 1 🌻

1. 2. Moreover, he has a son named Indrajit. Due to the boons and blessings of Paramashiva he didn't taste  defeat till date. 

3. 4. Unable to stand in front of him many a times Gods fled away. On top of that,  Kumbhakarna another mighty demon is Ravana's brother. 

5. 6. Also, the immortal Vibheeshana having many divine weapons is also his brother. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment