నిర్మల ధ్యానాలు - ఓషో - 379
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 379 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. 🍀
మీ ప్రేమని పదింతలు చెయ్యడానికే నా ప్రయత్నమంతా దాదాపు అన్ని మతాలు దానికి వ్యతిరేకంగా పని చేశాయి. ప్రేమ బాధలకు కారణమని ప్రేమని వదిలిపెట్టమని బోధించాయి. ప్రేమ దుఃఖాన్ని యిస్తుందని నేనూ గమనించాను. దాన్ని చూడ్డం వల్ల పరిమితుల్ని, హద్దుల్ని చెరిపెయ్యమని బోధించాను. నీ ప్రేమ హద్దుల్ని అధిగమించాలి. అన్ని మతాలకు సంబంధించిన నాకు సంబంధించిన ఆరంభం ఒకే కేంద్రం నించీ సాగినా అవి విభిన్న కోణాల్లో సాగాయి.
ప్రేమ కష్టాల్ని సృష్టిస్తుందని వాళ్ళంటారు. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. ప్రేమ తక్షణ స్పందనగా, సహజ విషయంగా వుండాలి. అప్పుడు హద్దుల్లేని ప్రేమ స్వేచ్ఛగా వుంటుంది. అపుడు నీ అస్తిత్వం, నీ ఆత్మ ప్రేమగా మారుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment