శ్రీ శివ మహా పురాణము - 537 / Sri Siva Maha Purana - 537
🌹 . శ్రీ శివ మహా పురాణము - 537 / Sri Siva Maha Purana - 537 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴
🌻. కన్యాదానము - 2 🌻
నారుదుడిట్లు పలికెను -
నీవు మూర్ఖుడవై నావు. నీకేమియూ తెలియదు. మహేశ్వరుని గురించి ప్రశ్నించుటచే నీవు పూర్తిగా బహిర్ముఖుడవై ఉన్నావని స్పష్టమైనది (14). నీవు ఈ సమయములో సాక్షాత్తు హరుని తన గోత్రమును చెప్పుమని ప్రశ్నించితివి. ఇది ఎంతయూ అపహాస్యకరమగు మాట యగును (15). ఓ పర్వతా ! ఈయన గోత్ర కుల నామములు విష్ణు బ్రహ్మాదులకైనను తెలియవు. ఇతరుల గురించి చెప్పున దేమున్నది? (16).
ఓ పర్వతా ! ఎవని యొక్క ఒక్క దినములో కోటి బ్రహ్మలు లయమగుదురో ఆ శంకరుడీనాడు కాళి యొక్క తపోబలము వలన నీకు కనుబడినాడు (17). ఈయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. ప్రకృతికి అతీతుడై ప్రకృతిని తన వశమునందుంచు కొనువాడు. వికారహీనుడగు శివుడు సర్వోత్కృష్టుడు (18). భక్తవత్సలుడు, స్వతంత్రుడునగు శివునకు కులగోత్రములు, నామములు లేవు. ఆయన తన ఇచ్ఛచే సగుణుడై దేహమును స్వీకరించి అనేక నామములను ధరించును (19).
మంచి గోత్రము గలవాడు, కాని గోత్రము లేనివాడు, మంచి కులమునకు చెందినవాడు, కాని కులము లేనివాడు ఆగు శివుడు ఈనాడు పార్వతి యొక్క తపస్సుచే నీ అల్లుడైనాడు. సందేహము లేదు (20). లీలా విహారియగు శివునిచే స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయూ మోహింపబడి యున్నది. ఓ పర్వత శ్రేష్ఠా! శివుని పండితులు కూడా ఎరుంగ జాలరు (21).
మహేశ్వరుడు లింగాకారమును ధరించగా ఆయన అగ్రబాగము ఎవ్వరికీ కానరాలేదు. విష్ణువు పాతాళమునకు వెళ్లియూ ఆ లింగము యొక్క మూలమును గన జాలక చకితుడైనాడు (22). ఓ పర్వత రాజా! ఇన్ని మటలేల? శివమాయను దాట శక్యము కాదు. విష్ణు బ్రహ్మాదులతో సహా ముల్లోకములు శివమాయకు అధీనములై ఉన్నవి (23).
కావున పార్వతీ జనకుడవగు నీవు జాగ్రత్తగా విచారించు కొనుము. ఇటు వంటి వరుని విషయములో అల్పమగు విర్శయైననూ ఈ సమయములో చేయదగదు (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 537 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴
🌻 The ceremonious entry of Śiva - 2 🌻
Nārada said:—
14. You have been utterly deluded. You do not know anything about Śiva of whom you speak. You have no inner vision.
15. Śiva was directly asked by you to mention His Gotra. On this occasion these words are utterly ridiculous and derisible.
16. O mountain, even Viṣṇu, Brahmā and other gods do not know His Gotra, family and name. What then can be said about others?
17. It was a result of the severe penance of Pārvatī that Śiva was seen by you, O mountain, in one day according to whose calculation a crore of Brahmās become annihilated.
18. He is the formless supreme Brahman. He is attributeless. He is greater than Primordial Nature. He has no shape, is free from aberrations He is the master of delusion. He is greater than the greatest.
19. He has no Gotra, family or name. He is independent. He is favourably disposed to His devotees. At
His will He assumes bodies taking many names. He is full of attributes.
20. He is sugotrin (having good gotra) as well as devoid of gotra. He is of noble family as well as devoid of a family. Thanks to Pārvatī’s penance. He has now become your son-in-law, There is no doubt about it.
21. The whole world consisting of the mobile and immobile has been deluded by Him in His divine sport. O excellent mountain, even the wisest of men does not know Him.
22. The head of lord Śiva of phallic image was not seen by Brahma. Viṣṇu who went to the nether worlds did not see His foot. How surprised he was.
23. O excellent mountain, of what avail is this talk? Śiva’s magical power is inscrutable. The three worlds, Viṣṇu, Brahmā and others too are subservient to Him.
24. Hence, O father of Pārvatī, ponder over this deeply. No doubt need be entertained by you even slightly with respect to this bridegroom of your choice.
Continues....
🌹🌹🌹🌹🌹
21 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment