శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 357-2. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻


సంసార జీవులకు తాపత్రయములు తప్పవు. సుఖమునకై యత్నించుచు వారు తాపత్రయాగ్నిలో ఉడికిపోవు చుందురు. చేసిన ప్రతి కర్మ, పలికిన ప్రతి మాట కొంత దోషముతో కూడిన దగుటచే ఫలితములను గూర్చిన కోరికలలో చిక్కుకొనుట జీవులకు తప్పదు. పనుల వలన కర్మలు బంధించుట, బంధము వలన ఉడుకుట జరుగు చుండును. ఇట్టి తాపత్రయములకు పరిష్కారము దైవమునకు సమర్పితమైన జీవితమును స్వీకరించుటయే.

జీవుని బుద్ధి, కర్మల ననుసరించి నడచును. కావున సతతము చిక్కుకొనుట జరుగుచునే యుండును. జీవితము చిక్కులు పడుచున్నకొద్ది తాపము పెరుగుచుండును. దేహ తాపము, భావతాపము, మరణించిన వెనుక తా నెటుపోవునో అన్న భయము పీడించు చుండగ జనన మరణముల ఊబిలో పడిపోవును. తనయందు కలుగు సంకల్పములు, తన చేతలు, తన మాటలు తన వశములో నుండనపుడు తరించుటకు ఉపాయము ఒక్కటియే యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 357-2. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻


The three types of miseries are: 1. ādhyātmika – this comprises of the four components of antaḥkaraṇa, five karmendriya-s and five jñānendriya-s. 2. ādhibhautika – comprises of five basic elements and sense organs. 3. ādhidaivata – influence of super human powers.

All the three are called afflictions because they function on the basis of data provided by the sense organs.

Bṛhadāraṇyaka Upaniṣad (IV.iv.25) says, “That great birthless Self is un-decaying, immortal, undying, fearless...”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



21 Mar 2022

No comments:

Post a Comment