శ్రీమద్భగవద్గీత - 276: 06వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 276: Chap. 06, Ver. 43

 

🌹. శ్రీమద్భగవద్గీత - 276 / Bhagavad-Gita - 276 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 43 🌴

43. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయ: సంసిద్ధౌ కురునన్దన ||

🌷. తాత్పర్యం :

ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడ గతజన్మపు దివ్యచైతన్యమును పునరిద్ధరించుకొని పూర్ణవిజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును.

🌷. భాష్యము :

పూర్వజన్మపు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయుటకు ఉత్తమజన్మ అవసరమనెడి విషయమునకు తన మూడవజన్మను ఉత్తమ బ్రహ్మణవంశములో పొందినట్టి భరతమాహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణమై యున్నది. భరతమాహారాజు సమస్త ప్రపంచమునకు చక్రవర్తియై యుండెను. అతని కాలము నుండియే ఈ లోకము భారతవర్షముగా దేవతాలోకములలో ప్రసిద్ధి నొందినది. పూర్వము ఇది ఇలావృతవర్షముగా తెలియబడెడిది. ప్రపంచాధినేతయైన అతడు ఆధ్యాత్మికసిద్ధిని గోరి యుక్తవయస్సు నందే కర్మల నుండి విరమణను పొందినను జయమును సాధింపలేకపోయెను.

తత్కారణముగా అతడు జన్మనెత్తవలసి వచ్చినను, మూడవజన్మను ఒక ఉత్తమబ్రాహ్మణుని ఇంట పొందెను. సదా ఏకాంతస్థలములో వసించుచు మౌనియై నిలిచినందున అతడు జడభరతుడని పిలువబడెను. కాని అతడు గొప్పయోగి యని తదనంతరము రహుగణుడను రాజు అవగతము చేసికొనగలిగెను. ఆధ్యాత్మిక యత్నములు (యోగాభ్యాసము) ఎన్నడును వృథా కావని భరతుని ఈ చరిత్ర ద్వారా అవగతమగుచున్నది. అనగా యోగాభ్యాసి శ్రీకృష్ణభగవానుని కరుణచే కృష్ణభక్తిభావన యందలి పూర్ణత్వమునకై అనుకూల పరిస్థితులను మరల మరల పొందుచునే యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 276 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 43 🌴

43. tatra taṁ buddhi-saṁyogaṁ labhate paurva-dehikam
yatate ca tato bhūyaḥ saṁsiddhau kuru-nandana


🌷 Translation :

On taking such a birth, he revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success, O son of Kuru.

🌹 Purport :

King Bharata, who took his third birth in the family of a good brāhmaṇa, is an example of good birth for the revival of previous transcendental consciousness. King Bharata was the emperor of the world, and since his time this planet has been known among the demigods as Bhārata-varṣa. Formerly it was known as Ilāvṛta-varṣa.

The emperor, at an early age, retired for spiritual perfection but failed to achieve success. In his next life he took birth in the family of a good brāhmaṇa and was known as Jaḍa Bharata because he always remained secluded and did not talk to anyone. And later on he was discovered as the greatest transcendentalist by King Rahūgaṇa. From his life it is understood that transcendental endeavors, or the practice of yoga, never go in vain. By the grace of the Lord the transcendentalist gets repeated opportunities for complete perfection in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment