🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 253 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఈ అనంత అస్తిత్వం సంగీతం మినహా మరేమీ కాదు. మార్మికులు దేవుణ్ణి 'సంగీతం' అన్నారు. దేవుడు వ్యక్తి కాడు. అస్తిత్వానికి సంబంధించిన అంతిమ సమశృతి. 🍀
ధ్యానం నిన్ను గొప్ప సంగీతం వేపుకు మేల్కొల్పుతుంది. అంతర్బహి సంగీతం వేపు మేల్పొల్పుతుంది. అది అక్కడ వుంది. కానీ మనమే చురుగ్గా లేం. మనం మేలుకొనిలేం. అందువల్ల మనం దాన్ని కోల్పోతున్నాం. లేకుంటే ఈ అనంత అస్తిత్వం సంగీతం మినహా మరేమీ కాదు. మార్మికులు దేవుణ్ణి 'సంగీతం' అన్నారు. దేవుడు వ్యక్తి కాడు. అస్తిత్వానికి సంబంధించిన అంతిమ సమశృతి.
అది వాయిద్య పరికరాల సమూహం. ప్రతిదీ ప్రతిదానితో సమశృతిలో వుంటుంది. చెట్లు భూమితో, భూమి గాలితో, గాలి ఆకాశంతో, ఆకాశం నక్షత్రాలతో అలా సమశృతి కొనసాగుతుంది. ఇక్కడ వైరుధ్యం లేదు. ఇక్కడ గడ్డిపోచ కూడా పెద్ద నక్షత్రంలా విలువైనదే. ఉనికి కలిగిందే. అవి రెండూ అస్తిత్వ సంగీత సమ్మేళనంలో అంతర్భాగాలే. అవి రెండు గానాన్ని సంపన్నం చేస్తాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment