12-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 184🌹  
2) 🌹. శివ మహా పురాణము - 384🌹 
3) 🌹 Light On The Path - 133🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -12🌹
5) 🌹 Seeds Of Consciousness - 331🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 206🌹
7) 🌹 Osho Daily Meditations - 1 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 61 / Lalitha Sahasra Namavali - 61🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 61 / Sri Vishnu Sahasranama - 61🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -184 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 25

*🍀 25. ఆత్మ దర్శనము 🍀*

శనై: శనై రుపరమే ద్బుద్యా ధృతి గ్రహీతయా |
ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 25

మెల్ల మెల్లగ అంతర్ముఖమైన చిత్తము బుద్ధి యందు చేరి ఆత్మయందు లగ్నము కాగా, ఇతర చింతలు క్రమముగ తొలగి పోవును. 

బాహ్య ప్రపంచ విషయముల నుండి సులభముగ విడుదల కలిగి అంతరంగ దివ్యానుభూతియందు, దాని మూలమైన చిత్తము నందు స్థిరము చెంది, దీర్ఘమగు ప్రశాంతిని పొందును. 

ఆత్మ యందు రతి బలమగుట చేత బాహ్యము నందు కూడ క్రమముగ ఆత్మదర్శనము ప్రాప్తించును. 

నిజమున కాత్మ అన్ని రూపములకు మూలమై ఉన్నది కనుక దానిని చూచుట ప్రారంభ మగును. అంతరంగమునందే గాక బహిరంగమున కూడ ఆత్మ గోచరించు చుండుట వలన, ఆత్మ సాధకునకు ఉత్సాహము కలుగుచు నుండును. ఇది ఒక శుభమగు స్థితి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 384🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 15

*🌻. తారకుని తపస్సు - 1🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

అటు పిమ్మట వజ్రాంగుని ప్రియురాలగు ఆ వరాంగి గర్భమును ధరించెను. ఆ శిశివు ఆమె గర్భములోపల అనేక సంవత్సరములు గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను(1). తరువాత , గర్భధారణ సమయము పూర్తి కాగానే ఆ సుందరి పెద్ద శరీరము గలవాడు, గొప్ప బలశాలి, పది దిక్కులను ప్రకాశింప జేయుచున్న వాడునగు కుమారుని కనెను. (2). 

ఆ సుందరికి దేవతలకు దుఃఖమును కలిగింపబోవు ఆ బాలుడు పుట్టుచుండగా , అదే సమయములో పీడను కలిగించు గొప్ప ఉత్పాతములు కలిగినవి (3). రాబోవు అనర్థమును సూచించు మూడు రకముల ఉత్పాతములు ద్యులోకమునందు, భూలోకమునందు, మరియు అంతరిక్షమునందు కూడ కలిగెను. అవి సర్వప్రాణులకు భీతిని గొల్పెను. వాటిని నేను వివరించెదను(4).

  భయమును కలిగించే ఉల్కలు, పిడుగులు గొప్ప శబ్దమును చేయుచూ పడినవి దుఃఖమును కలిగించే క్రూర జంతువులు పుట్టజొచ్చినవి(5). 

భూమి, దానితో బాటు పర్వతములు కపించినవి . దిక్కులన్నియూ మండినవి . సర్వనదులతో బాటు సముద్రములు విశేషించి క్షోభను పొందినవి(6). తుఫాను గాలులే సైన్యముగా కలిగినట్టియు, ధూళియే ధ్వజముగా గల వాయుదేవుడు పెద్ద శబ్ధమును విచిత్ర ధ్వనులను చేయుచూ. సర్శ చేతనే పీడను కలిగించుచూ, పెద్ద వృక్షములను పెకలించుచూ వీయజొచ్చెను(7). 

రాహువుతో కూడిన సూర్య చంద్రుల చుట్టూ తరచుగా కాంతి మండలము లేర్పడెను. ఓ ద్విజశ్రేష్ఠా! సుఖమును అపహరించు ఈ ఉత్పాతములు రాబోవు మహాభయమును సూచించుచుండెను(8).

ఆ సమయములో కొండ గుహలనుండి భయమును కలిగించే రథశబ్దమును పోలియున్న శబ్దము గల భూకంపములు పుట్టినవి(9). ఆమంగళకరములగు నక్కలు నోటినుండి నిప్పులను గ్రక్కుచూ గ్రామముల మధ్యలో కర్ణ కఠోరమగు శబ్దములను చేసినవి. వీటికి గుడ్ల గూబల ధ్వనులు తోడయ్యెను(10). కుక్కలు ఇటునటుల తిరుగుచూ శిరస్సులను పైకెత్తి నేలను తన్నుచూ ఒకప్పుడు సంగీతమును, మరియొకప్పుడు ఏడ్పులను చేయుచూ అనేక శబ్దములను చేసినవి(11). వత్సా! ఆ సమయములో మదించిన గాడిదలు గుంపులు గుంపులుగా ఇటునటు పరుగెత్తుచున్నవై కర్కశముగా ఓండ్రపెట్టుచున్నవై గిట్టలతే నేలను తన్నుచుండెను.(12)

భీకరశబ్ధములచే భయమును చెందిన పక్షులు ఏడ్చుచూ గూళ్లనుండి ఎగిరిపోయినవి. అవి ఒకచోట స్థిరముగా కుర్చుండలేకపోయినవి(13). పశువులు ఎవరో కొడుతున్నారా యన్నట్లు పశువులశాలలో గాని, అడవిలో గాని స్ధిరముగా నుండలేక ఇటునటు తిరుగుతూ మలమూత్రములను విసర్జించినవి(14). గోవులు భయముచే వ్యాకులితములై కనులవెంబడి నీరు గార్చుచూ పాలకు బదులుగా రక్తమును స్రవించినవి. మేఘములు భయము కలుగు విధముగా చీమును వర్షించినవి(15). దేవతా ప్రతిమలు ఎగిరిపడుతూ రోదించినవి. గాలి లేకుండగనే చెట్లు నేల గూలినవి. ఆకాశమునందు గ్రహముల మధ్య రగడ చెలరేగెను.(16)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 133 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. do you enter into a partnership of joy, which brings indeed terrible toil and profound sadness, but also a great and ever-increasing delight. - 2 🌻*

505. C.W.L. – You enter into a partnership of joy, but it brings also terrible toil and profound sadness, says the Master’s note. All of that is true, but it is also true that the ever-increasing joy counterbalances the sadness.

506. Every student who has developed his faculties fully is, by the hypothesis, a sympathetic man; he must pass through a period of sadness and almost of despair, because of all the sorrow and suffering which he sees. 

Because people are backward in evolution and are not yet reasonable, there is in evidence much more of suffering and sorrow, of anger, hatred, jealousy, envy and the like than of high virtues, so that there is a preponderance of unpleasant vibrations from humanity. This shows itself in the astral world, so that any man who becomes fully developed astrally becomes at the same time aware of the sorrow and trouble of the world – aware of it only in a vague way, but it is ever present with him as a weight resting upon him. 

Constantly individual instances of the astral sorrow and suffering which happen to occur in his neighbourhood also press strongly upon him. In addition any catastrophe involving a great deal of sorrow to a large number of people distinctly influences the astral atmosphere of the world.

507. The student has to learn how to receive that without being weighed down by it, and that takes a considerable time. He gradually learns to look more deeply, and as time goes on he begins to see that all this trouble is necessary under the circumstances which men themselves have created. The suffering that comes is a necessity because of their great carelessness and laxity. 

If men had been a little more careful a very great part of it could easily have been avoided. I have mentioned before that the real suffering brought to us by karma from past lives is perhaps a tenth of that which comes to us, and the other nine-tenths is the result of our own wrong attitude here and now, in this life. In that sense there is a vast amount of entirely unnecessary suffering. 

But the other side of the shield is that while people persist in taking the wrong attitude, in thinking and acting foolishly, under the eternal law suffering must come upon them; in an indirect way that is distinctly good, because it is bringing them to a sense of their own folly. The pity is that they need so very much reminding, that they cannot at once take the hint and alter their attitude – so much suffering might be saved if that could be.

508. This seems to all of us who have studied the matter very easy to see. I cherish a hope, therefore, and I think a well-founded hope, that the suffering of the world will diminish very rapidly as soon as the common-sense view of things is accepted by a fairly large minority of people. 

They will come to see that they are making their own trouble for themselves, and in process of time they will refrain from all that is undesirable, purely from the common-sense point of view. Members of the Theosophical Society ought to be displaying before the world an example of the Theosophical attitude towards life, but there are many of them who, although they know these truths, find it hard to put them into practice.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 12 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌸. గుణం ప్రధానం 🌸*

గుణం ప్రధానం గాని, కేవలం బాహ్యకర్మలూ, బాహ్యవేశాలూ ప్రధానం కాదు- నిజమే అయినప్పటికీ, సాధకుడు‌ ప్రారంభదశలో‌ బాహ్యకర్మలనూ వేషములనూ విడిచి పెట్టకూడదు. వ్యాధి కుదిరిన పిమ్మట పథ్యం అక్కరలేదు గాని, కుదిరే వరకూ తప్పదు కదా! 

దైవీ గుణములు సహజములైన పిమ్మట బాహ్య కర్మల యొక్క, లక్షణముల యొక్క అవసరం ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 331 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 180. Along with the knowledge 'I am' appears space and the world. When the knowledge 'I am' departs the world is liquidated. 🌻*

Think hard, apply your mind and try to recollect the moment when the knowledge 'I am' first appeared spontaneously and you came know that 'you are'. If this is hard, then try to observe what happens the next time you wake up from deep sleep. 

The 'I am', space and the world appear almost simultaneously, in one stroke, and then everything else takes over and the fact that those three have 'appeared' on you is obliterated. 

What is it that is holding this perception of yours? Is it not the 'I am'? As long as the 'I am' is there you will perceive the space and world. If the 'I am' departs both will disappear.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 206 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సమీక్ష - 4 🌻*

764. స్థూల, సూక్ష్మ, కారణ దేహములు - పరిమితిగలవి, రూపముగలవి, నశ్వరమైనవి.

765. ముల్లోకములు - ఆయదార్థములు, ఆభాసములు, కల్పితములు, స్వప్నతుల్యములు.

766. ఆత్మ, స్థూల రూపముల ద్వారా, భౌతిక ప్రపంచనుభవమును పొందుచున్నపుడు, అసంఖ్యాక రూపములతో సహకరించు చుండును. దీనినే జననము అందురు.

767. ఆత్మ, స్థూలరూపముల ద్వారా భౌతిక ప్రపంచనుభవమును పొందుచున్నపుడు, అసంఖ్యాక రూపముల నుండి వియోగ మందు చుండును. దీనినే మరణము అందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹Osho Daily Meditations - 1🌹*
📚. Prasad Bharadwaj

*🍀 1 . ILLUMINATION 🍀*

The moment you are illuminated, the whole if existence is illuminated. If you are dark, then the whole if existence is dark. It all depends on you.

There are a thousand and one fallacies about meditation prevalent all around the world. Meditation is very simple: It is nothing but consciousness. It is not chanting, it is not using a mantra or a rosary.

These are hypnotic methods. They can give you a certain kind of rest-nothing is wrong with that rest; if one is just trying to relax, it is perfectly good. Any hypnotic method can be helpful, but if one wants to know the truth, then it is not enough. 

Meditation simply means transforming your unconsciousness into consciousness. Normally only one-tenth of our mind is conscious, and nine-tenths is unconscious. Just a small part of our mind, a thin layer, has light; otherwise the whole house is in darkness. And the challenge is to grow that small light so much that the whole house is flooded with light, so that not even a nook or corner is left in darkness.

When the whole house is full of light, then life is a miracle; it has the quality of magic. Then it is no longer ordinary- everything becomes extraordinary. The mundane is transformed into the sacred, and the small things of life start having such tremendous significance that one could not have ever imagined it. 

Ordinary stones look as beautiful as diamonds; the whole of existence becomes illuminated. The moment you are illuminated, the whole of existence is illuminated. If you are dark, then the whole of existence is dark. It all depends on you.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 61 / Sri Lalita Sahasranamavali - Meaning - 61 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।*
*చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀*

🍀 249. పంచప్రేతాసనాసీనా - 
పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.

🍀 250. పంచబ్రహ్మస్వరూపిణీ -
 పంచబ్రహ్మల స్వరూపమైనది.

🍀 251. చిన్మయీ - 
జ్ఞానముతో నిండినది.

🍀 252. పరమానందా - 
బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.

🍀 253. విజ్ఞానఘనరూపిణీ - 
విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 61 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 61. pañca-pretāsanāsīnā pañcabrahma-svarūpiṇī |*
*cinmayī paramānandā vijñāna-ghanarūpiṇī || 61 || 🌻*

🌻 249 ) Pancha prethasana seena -   
She who sits on the seat of five dead bodies ( these are Brahma , Vishnu, Rudra, Eesa and Sadasiva without their Shakthi(consort))

🌻 250 ) Pancha brahma swaroopini -   
She who is personification of five brahmas ( they are the gods mentioned in the last name with their Shakthi)

🌻 251 ) Chinmayi -  
 She who is the personification action in every thing. 

🌻 252 ) Paramananda -   
She who is supremely happy. 

🌻 253 ) Vignana Gana Roopini -   
She who is the personification of knowledge based on science

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 61 / Sri Vishnu Sahasra Namavali - 61 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*విశాఖ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🌻 61. సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః।*
*దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః॥ 61 🌻*

 🍀 567) సుధన్వా - 
శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.

🍀 568) ఖండ పరశు: - 
శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.

🍀 569) దారుణ: - 
దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.

🍀 570) ద్రవిణప్రద: - 
భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.

🍀 571) దివ: సృక్ - 
దివిని అంటియున్నవాడు.

🍀 572) సర్వదృగ్య్వాస: - 
సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.

🍀 573) వాచస్పతి రయోనిజ: - 
విద్యలకు పతి, మరియు మాతృగర్భమున జన్మించనివాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 61 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Visakha 1st Padam*

*🌻 61. sudhanvā khaṇḍaparaśurdāruṇō draviṇapradaḥ |*
*divaspṛk sarvadṛgvyāsō vācaspatirayōnijaḥ || 61 || 🌻*

🌻 567. Sudhanvā: 
One who has got as His weapon the bow named Saranga of great excellence.

🌻 568. Khaṇda-paraśuḥ: 
The battle-axe that destroys enemies.

🌻 569. Dāruṇaḥ: 
One who is harsh and merciless to those who are on the evil path.

🌻 570. Draviṇapradaḥ: 
One who bestows the desired wealth on devotees.

🌻 571. Divah-spṛk: 
One who touches the heavens.

🌻 572. Sarvadṛg-vyāsaḥ: 
One whose comprehension includes everything in its ambit.

🌻 573. Vācaspatirayōnijaḥ: 
The Lord is Vachaspati because He is the master of all learning. He is Ayonija because He was not born of a mother. This forms a noun in combination with the attribute.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment