✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 25
🍀 25. ఆత్మ దర్శనము 🍀
శనై: శనై రుపరమే ద్బుద్యా ధృతి గ్రహీతయా |
ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 25
మెల్ల మెల్లగ అంతర్ముఖమైన చిత్తము బుద్ధి యందు చేరి ఆత్మయందు లగ్నము కాగా, ఇతర చింతలు క్రమముగ తొలగి పోవును.
బాహ్య ప్రపంచ విషయముల నుండి సులభముగ విడుదల కలిగి అంతరంగ దివ్యానుభూతియందు, దాని మూలమైన చిత్తము నందు స్థిరము చెంది, దీర్ఘమగు ప్రశాంతిని పొందును.
ఆత్మ యందు రతి బలమగుట చేత బాహ్యము నందు కూడ క్రమముగ ఆత్మదర్శనము ప్రాప్తించును.
నిజమున కాత్మ అన్ని రూపములకు మూలమై ఉన్నది కనుక దానిని చూచుట ప్రారంభ మగును. అంతరంగమునందే గాక బహిరంగమున కూడ ఆత్మ గోచరించు చుండుట వలన, ఆత్మ సాధకునకు ఉత్సాహము కలుగుచు నుండును. ఇది ఒక శుభమగు స్థితి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2021
No comments:
Post a Comment