🌹 . శ్రీ శివ మహా పురాణము - 384🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 15
🌻. తారకుని తపస్సు - 1🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
అటు పిమ్మట వజ్రాంగుని ప్రియురాలగు ఆ వరాంగి గర్భమును ధరించెను. ఆ శిశివు ఆమె గర్భములోపల అనేక సంవత్సరములు గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను(1). తరువాత , గర్భధారణ సమయము పూర్తి కాగానే ఆ సుందరి పెద్ద శరీరము గలవాడు, గొప్ప బలశాలి, పది దిక్కులను ప్రకాశింప జేయుచున్న వాడునగు కుమారుని కనెను. (2).
ఆ సుందరికి దేవతలకు దుఃఖమును కలిగింపబోవు ఆ బాలుడు పుట్టుచుండగా , అదే సమయములో పీడను కలిగించు గొప్ప ఉత్పాతములు కలిగినవి (3). రాబోవు అనర్థమును సూచించు మూడు రకముల ఉత్పాతములు ద్యులోకమునందు, భూలోకమునందు, మరియు అంతరిక్షమునందు కూడ కలిగెను. అవి సర్వప్రాణులకు భీతిని గొల్పెను. వాటిని నేను వివరించెదను(4).
భయమును కలిగించే ఉల్కలు, పిడుగులు గొప్ప శబ్దమును చేయుచూ పడినవి దుఃఖమును కలిగించే క్రూర జంతువులు పుట్టజొచ్చినవి(5).
భూమి, దానితో బాటు పర్వతములు కపించినవి . దిక్కులన్నియూ మండినవి . సర్వనదులతో బాటు సముద్రములు విశేషించి క్షోభను పొందినవి(6). తుఫాను గాలులే సైన్యముగా కలిగినట్టియు, ధూళియే ధ్వజముగా గల వాయుదేవుడు పెద్ద శబ్ధమును విచిత్ర ధ్వనులను చేయుచూ. సర్శ చేతనే పీడను కలిగించుచూ, పెద్ద వృక్షములను పెకలించుచూ వీయజొచ్చెను(7).
రాహువుతో కూడిన సూర్య చంద్రుల చుట్టూ తరచుగా కాంతి మండలము లేర్పడెను. ఓ ద్విజశ్రేష్ఠా! సుఖమును అపహరించు ఈ ఉత్పాతములు రాబోవు మహాభయమును సూచించుచుండెను(8).
ఆ సమయములో కొండ గుహలనుండి భయమును కలిగించే రథశబ్దమును పోలియున్న శబ్దము గల భూకంపములు పుట్టినవి(9). ఆమంగళకరములగు నక్కలు నోటినుండి నిప్పులను గ్రక్కుచూ గ్రామముల మధ్యలో కర్ణ కఠోరమగు శబ్దములను చేసినవి. వీటికి గుడ్ల గూబల ధ్వనులు తోడయ్యెను(10). కుక్కలు ఇటునటుల తిరుగుచూ శిరస్సులను పైకెత్తి నేలను తన్నుచూ ఒకప్పుడు సంగీతమును, మరియొకప్పుడు ఏడ్పులను చేయుచూ అనేక శబ్దములను చేసినవి(11). వత్సా! ఆ సమయములో మదించిన గాడిదలు గుంపులు గుంపులుగా ఇటునటు పరుగెత్తుచున్నవై కర్కశముగా ఓండ్రపెట్టుచున్నవై గిట్టలతే నేలను తన్నుచుండెను.(12)
భీకరశబ్ధములచే భయమును చెందిన పక్షులు ఏడ్చుచూ గూళ్లనుండి ఎగిరిపోయినవి. అవి ఒకచోట స్థిరముగా కుర్చుండలేకపోయినవి(13). పశువులు ఎవరో కొడుతున్నారా యన్నట్లు పశువులశాలలో గాని, అడవిలో గాని స్ధిరముగా నుండలేక ఇటునటు తిరుగుతూ మలమూత్రములను విసర్జించినవి(14). గోవులు భయముచే వ్యాకులితములై కనులవెంబడి నీరు గార్చుచూ పాలకు బదులుగా రక్తమును స్రవించినవి. మేఘములు భయము కలుగు విధముగా చీమును వర్షించినవి(15). దేవతా ప్రతిమలు ఎగిరిపడుతూ రోదించినవి. గాలి లేకుండగనే చెట్లు నేల గూలినవి. ఆకాశమునందు గ్రహముల మధ్య రగడ చెలరేగెను.(16)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2021

No comments:
Post a Comment