శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు Sri Shyamala Navratri
🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు 🌹
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు.
శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .
శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు..
శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.
ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.
శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.
ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.
🌷. శ్రీ శ్యామలా స్తుతి 🌷 Sri Shyamala Stuti
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||
🌹 🌹 🌹 🌹 🌹
02 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment