🌹. గీతోపనిషత్తు - 51 🌹
🍀 11. సంఘ శ్రేయస్సు - కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియతకర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 20 📚
20. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి || 20 ||
కర్మమంతయు సంఘముతో ముడిపడి యున్నది. సంఘము నడుచుటకు కర్మము ప్రధానము. వివిధములైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల ద్వారా ప్రతివారును సంఘమునకు తోడ్పాటు చేయుచు సంఘము నుండి లభించిన దానిని పొందుతూ జీవించుట జరుగుచున్నది.
సంఘమునకు శ్రేయోదాయకమైన కార్యముల నొనర్చుట ద్వారా సంఘమున జీవించుటకు జీవుడర్హత పొందుచున్నాడు. వివిధ పద్ధతులలో సంఘమునకు జీవుల సేవ లభ్యమగును.
సంఘమునకు తోడ్పాటు చేయు ఆశయముతోనే సంఘమున పనిచేయవలెను. అట్లు పనిచేయు వారిని సంఘము సహజముగ మన్నించును, గౌరవించును, ఆదరించును కూడ.
ఇట్లు సంఘమున ఆదరణము పొందినవారు, గౌరవము పొందినవారు, ఇతరులు కూడ అదే మార్గమున ప్రవర్తించుటకు స్పూర్తిని కలిగింతురు.
అందువలన కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియత కర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#చైతన్యవిజ్ఞానం #ChaitanyaVijnanam #PrasadBhardwaj #గీతోపనిషత్తు #సద్గురుపార్వతీకుమార్
12 Oct 2020
No comments:
Post a Comment