శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 33, 34 / Sri Lalitha Chaitanya Vijnanam - 33, 34

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 20 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 33, 34 / Sri Lalitha Chaitanya Vijnanam - 33, 34 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి

🌻. 33. 'కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ' 🌻

తన స్తనములను ప్రతిపణముగ నిచ్చి పరమశివుని ప్రేమ అను రత్నమును సంపాదించినది అని భావము. అట్టి మణిని ధరించి యున్నది అని భావము. అనగా తన హృదయమును భగవంతునకు అర్పణము చేసి భగవంతుని ప్రేమపూరితమైన కాంతిని తన హృదయమున పొందుపరచు కొన్నది. హృదయమును అర్పించుట యనగా తనను తాను సమర్పణము చేసుకొనుట.

అనగా దైవము కొరకే తాను జీవించుట. మరియొక జీవనము గాని, అస్థిత్వము గాని లేకుండుట. మనలను మనము భగవంతునికి ఎంత సమర్పణము

చేసుకొందుమో, మనకు భగవంతుడు అంత మాత్రముగనే అనుగ్రహించును. “ఎంత మాత్రమున ఎవ్వరు కొలచిన అంత మాత్రమే నీవు" అను అన్నమాచార్య కీర్తన సందేశాత్మకము. భగవంతుడు నీ హృదయమున ప్రతిష్ఠితుడై వెలుగొందుచు నుండవలె నన్నచో నీ హృదయమును భగవంతున కర్పింపవలెను.

శ్రీదేవి హృదయమున భగవత్ కాంతి మెరయుటనే ప్రేమ రత్నమణి అని వర్ణించబడినది. హృదయమునుండి వచ్చు కాంతి ప్రేమ, దాక్షిణ్యము, కారుణ్యము కలిగి యుండును. మణి కావున కాంతులను విరజిమ్మును. ప్రేమ రత్నమణి కావున ప్రేమతో కూడిన కాంతులను ప్రసరింపచేయును.

దానిని పొందుటకు శ్రీదేవి తన హృదయమునే ప్రతిపణముగ పెట్టినది. ఇదియే సాధకులకు ఉత్తమోత్తమమైన మార్గము. దీనిని సర్వసమర్పణ మార్గమని, సర్వహుత యజ్ఞమని తెలుపుదురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 33   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 33. Kāmeśvara- premaratna- maṇi-pratipaṇa-stanī कामेश्वर-प्रेमरत्न-मणि-प्रतिपण-स्तनी (33) 🌻

She offers her two bosoms to Kāmeśvara (Śiva) in return for His love.

The subtle meaning is that She will give Her blessings to Her devotees, twice the amount of devotion offered to Her.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 34 / Sri Lalitha Chaitanya Vijnanam - 34 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి

🌻 34. 'నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి' 🌻

నాభి నుండి ఊర్ధ్వముగ ఏర్పడిన రోమ పంక్తివంటి లత నుండి ఉద్భవించిన రెండు ఫలములవంటి కుచములు కలదానా అని భావము.

సమస్తమైన ప్రకృతియును భగవతి నాభినుండియే పుట్టుకు వచ్చినది. అంధకార బంధురమగు తామర తంపరవంటి సృష్టిని రోమములతో పోల్చి చెప్పుట ఒక సంప్రదాయము. తన మాయాజాలముచే, త్రిగుణాత్మక శక్తిచే నిర్మింపబడ్డ ప్రకృతి శ్రీదేవి బొడ్డునుండి పాదుకొని లతవలె ప్రాకుతూ అనంతముగ పెరిగియున్నది. ఈ లతకాధారము శ్రీదేవి నాభియే.

తన సృష్టియందలి జీవుడు ఇహపర వైభవములను అనుభవించుటకు తద్వారా ఆనందించుటకు జ్ఞాన విజ్ఞాన ఫలములను కూడ ఏర్పరచినది. విజ్ఞాన ఫలమును పొంది, ఇహలోక వైభవమను జ్ఞాన ఫలమును పొంది, పరలోక వైభవమును అనుభవించుటకు శ్రీదేవి వద్ద గల రెండు క్షీర కుంభములనే స్తన ద్వయముగ వర్ణింపబడినది.

జ్ఞాన విజ్ఞానములను పొందుట యందు ఆసక్తి గలవారికి తల్లివలె శ్రీదేవి తన స్తనద్వయము నందించును.

అందలి క్షీరమును గొని జీవులు

వివేకవంతులై వైభవోపేతము, దివ్యము అయిన జీవితములను పొందుచున్నారు. తెనాలి రామకృష్ణునకు అట్టి క్షీర కుంభములను అమ్మ ప్రేమతో అందించినది. అట్లే ద్రవిడ దేశమున జ్ఞాన సంబంధులకు తన స్తన్యములందించి జ్ఞానము నందించినది.

శ్రీదేవి స్తనద్వయమును మాంస మయములుగ చూచుట కరడు గట్టిన అజ్ఞానము. అవి మోహ కారకములు కావు. జ్ఞాన విజ్ఞాన కారకములు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 34 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 34. Nābhyālavāla- romāli-latā- phala-kucadvayā नाभ्यालवाल-रोमालि-लता-फल-कुचद्वया (34) 🌻

Her two bosoms are the fruits of the creeper (refers to hair) that springs from Her navel.

The significance of this nāma is on the navel and heart cakra-s. Meditating on the heart cakra by upwardly moving the kuṇḍalinī from navel cakra, gives fruits of meditation.

Saundarya Laharī (verse 76) says “The God of love afflicted by the fire of Śiva’s anger took shelter in your navel.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 
https://t.me/srilalithadevi


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


12 Oct 2020

No comments:

Post a Comment