శ్రీమద్భగవద్గీత - 285: 07వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 285: Chap. 07, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 285 / Bhagavad-Gita - 285 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 05 🌴

05. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||


🌷. తాత్పర్యం :

ఓ మాహాబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యునమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.

🌷. భాష్యము :

జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతమైన ప్రకృతికి (శక్తికి) చెందినవారని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శింపబడు భౌతికపదార్థమే న్యూనమైన శక్తి. భుమ్యాది స్థూలవిషయములు రెండు ప్రకృతిరూపములు న్యునశక్తి నుండి ఉద్భవించినట్టివే. వివిధప్రయోజనములకై ఈ న్యునశక్తులను వినియోగించుకొను జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతశక్తికి సంబంధించినవారై యున్నారు. అటువంటి ఈ ఉన్నతశక్తి వలననే సమస్తజగత్తు నడుచుచున్నది.

ఉన్నతశక్తికి చెందిన జీవుడు నడుపనిదే భౌతికజగత్తు నడువలేదు. కాని శక్తులు అన్నివేళలా వానిని కలిగియున్న శక్తిమానినిచే నియమింపబడి యున్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడెడివారే. కనుక వారికెన్నడును స్వతంత్ర ఉనికి యనునది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించునట్లు వారెన్నడును భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 285 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 05 🌴

05. apareyam itas tv anyāṁ prakṛtiṁ viddhi me parām
jīva-bhūtāṁ mahā-bāho yayedaṁ dhāryate jagat


🌷 Translation :

Besides these, O mighty-armed Arjuna, there is another, superior energy of Mine, which comprises the living entities who are exploiting the resources of this material, inferior nature.

🌹 Purport :

Here it is clearly mentioned that living entities belong to the superior nature (or energy) of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence and false ego. Both forms of material nature, namely gross (earth, etc.) and subtle (mind, etc.), are products of the inferior energy. The living entities, who are exploiting these inferior energies for different purposes, are the superior energy of the Supreme Lord, and it is due to this energy that the entire material world functions. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy, the living entity.

Energies are always controlled by the energetic, and therefore the living entities are always controlled by the Lord – they have no independent existence. They are never equally powerful, as unintelligent men think.

🌷 🌷 🌷 🌷 🌷


No comments:

Post a Comment