నిర్మల ధ్యానాలు - ఓషో - 67
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 67 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు. అంటే నీవేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. 🍀
నువ్వు పైకి వెళుతూ వుంటావు. దైవాన్ని అందుకోవాలను కుంటావు. ఎందుకంటే ఉన్నత స్థానానికి, నిజమైన ఉన్నత స్థానానికి ఎగబాకడమంటే అదే. తక్కిందంతా కింది స్థానంలో వున్నదే. నువ్వు దేవుని వైపు ప్రయాణిస్తే నువ్వు ఆరోహణలో వుంటావు. అక్కడ జరిగే అద్భుతమేమిటంటే నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు.
అంటే నీ వేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. అది వన్ వే కాదు, ఏ క్షణం అన్వేషకుడు సాగడం మొదలు పెడతాడో, అదే క్షణం దేవుడు తను సాగడం ఆరంభిస్తాడు. రెండూ ఏక కాలంలో సాగుతాయి. అవి ఒకే విధానానికి భిన్న ధృవాలు. చూసేవాడు, చూడబడేది. రెండూ ఒకటే. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. నువ్వు ఆరోహించందే అవరోహించడు.
మనుషులు నిశ్చలనంగా జీవిస్తారు. ఏ మార్పు లేకుండా జీవిస్తారు. అవకాశం లేనట్లు జీవిస్తారు. అక్కడ అనంత అవకాశం వుంది. మనిషి అనంత శక్తితో భూమిలోకి వచ్చాడు. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. మన అస్తిత్వం దేవుడే. మనిషే దైవ ప్రయత్నం చేస్తున్నాడనుకో కూడదు. దేవుడు కూడా మనిషి కోసం ప్రయత్నిస్తున్నాడు. అది ఏకపక్షమయితే అక్కడ అందముండదు. చలనముండదు. చైతన్యముండదు, అట్లాకాదు. అది రెండు వైపుల్నించీ సాగే ప్రేమ వ్యవహారం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment