🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 59 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 23 🌻
కాబట్టి, నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు.
యమధర్మరాజు ఇప్పటివరకూ చెప్పినటువంటి అంశాలనన్నిటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు. ఎట్లా సమీక్షించాడు?
మొదటి వరంలోనేమో తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షి కోరిన వరాన్ని ఇచ్చారు. రెండవ వరంలో నచికేతాగ్నిచయనము గురించినటువంటి బోధంతా చెప్పారు.
ఆ నచికేతాగ్ని చయనము అనేటటువంటి అగ్నిచయనాన్ని కర్మగా చేస్తే, నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అనీ చెప్తున్నాడు, రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే నకర్మణా - ఏం చేయడం ద్వారా కూడా నువ్వు పొందలేవు అని తద్‌విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు.
అతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి పద్ధతిని కూడా చెప్తూ, ఒక పక్కన ఏం చెప్తున్నాడు? అంటే నచికేతాగ్నిని అనుష్టయనం చేసి తాను అష్ట దిక్పాలకులలో ఒకడుగా అయ్యాను అనేటటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధములను ఒకేసారి చెప్తున్నాడేమిటి? అనేటటువంటి దానిని సంశయించాడు.
ఇంకేంటట? మధ్యమధ్యలో ఈ నచికేతుని యొక్క అధికారిత్వమును గురించి ప్రశంసించి, ఈయనని దాటవేస్తున్నాడేమో ఒకవేళ తాను ఏదైతే పొందాలని అనుకున్నాడో, తన ప్రశ్న ఏదైతే వుందో, మరణానంతరం జీవితం వుందా? మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి? అనే ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడేమో, కాబట్టి, అలాంటి పద్ధతి కాకుండా, ఆచార్యుడిని నేను స్పష్టముగా ప్రశ్నించాలి. ‘పరిప్రశ్నేన సేవయా’ - అనేటటువంటి పద్ధతిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మరల ప్రశ్నిస్తున్నాడు.
ఆచార్యా! నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతినేని, మీకు నా యందు సంపూర్ణ అనుగ్రహమున్న యెడల వేదవిహిత కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము, దాని ఫలమునకు వేరైనట్టియు, కార్యకారణ జగత్తునకు వేరైనట్టియు, కాలత్రయముచే బాధింపబడక అపరిచ్ఛిన్నమైనదో అట్టి పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. నీవెరిగిన ఆ తత్వమునే నాకు బోధింపుమని నచికేతుడు యముని ప్రార్థించెను.
అయ్యా! నీవు... ‘నేను అధికారిని’ అని అంటున్నావు కాబట్టి, మీ వద్ద వున్నటువంటి, పరమాత్మ తత్వమునకు సంబంధించినటువంటి, బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి. ఎందువల్ల? అంటే, దాని విశేషం ఏమిటంటే...
కర్మలు ద్వివిధింబులు.
1. వేద విహితమైన కర్మ.
2. వేద నిషిద్ధమైన కర్మ.
వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములని పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు.
వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారా ద్వంద్వానుభూతులైనటువంటి ఈ జగత్తునకు పుణ్యపాప కర్మల చేత, జనన మరణముల చేత, బాధించబడుతూ... స్వర్గ నరకముల చేత, అనుభూతములను పొందుతూ, సుఖదుఃఖాలను పొందుతూ, కష్ట నష్టాలను పొందుతూ... రాత్రి పగళ్ళయందు చరిస్తూ.... ఈ రకమైనటువంటి ద్వంద్వాలలో మునిగి తేలుతూ వుండేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. మరి ఈ రెండూ కూడా పరతత్వమును పొందింప జాలవు.
కాబట్టి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము.... ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ‘ఆత్మనిష్ఠ’ కాదు. కాబట్టి మీరు కార్యకారణ జగత్తుకు వేరైనట్టి... ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే కార్యకారణ వివేకం కనుక నీవు పొందకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు కాలేవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:
Post a Comment