🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మతంగ మహర్షి - 4 🌻
25. ఋషులెప్పుడు సత్యవాక్కులే చెపుతారు. వాళ్ళుచెప్పేది శాపం అంటారుకాని, అది సత్యమే! ఆ వాక్కు యథార్థమవుతోంది.
26. “నీలో రాక్షస ప్రవృత్తి ఉన్నది కాబట్టి రాక్షసుడివై పుట్టు. బ్రాహ్మణుడియొక్క రూపంలో రాక్షసవృత్తి కలిగిఉండి తిరిగితే, నిన్ను బ్రాహ్మణుడనుకుని నమస్కరిస్తారు. అందువలన అలా తిరగకు. ఇతరులు మోసపోకుండా ఉందురుగాక! నీవు సహజమైన జన్మ ఎత్తు!” అని ఋషుల తాత్మర్యం.
27. దానిని ఈ జన్మలో శాపం అంటాం మనం. ఏం! ఇది సత్యం కాదా! సత్యవాక్కులు వాళ్ళవి. మహర్షులు సత్యాన్ని ఆరాధిస్తారు. అంతఃకరణలో ఎప్పుడూ సత్యాన్నే పెట్టుకుంటారు. అసత్యం అనేది మనసా వాచా కర్మణా అంటదు వాళ్ళను.
28. మహర్షులందరూ సత్యవచనులు కాబట్టి వారు మహాత్ములవుతారు. ఏదో యోగబలముండి, తపోబలముండి, మనిషిని కుక్కను చేయగడొకడు. అంటే మాయల మరాఠికూడా అలా చేయగలడు. అయితే అంతమాత్రంచేత వాడు మహాత్ముదవుతాడా? అలాకాదు. ఋషులు అలాంటివారు కారు.
29. సత్యమే బ్రహ్మవస్తువు. సత్యమే జ్ఞానము. సత్యమే పరతత్త్వము. సత్యమే పరమేశ్వరుడు. సత్యమే శాశ్వతమైన వస్తువు.
30. సత్యము కానటువంటి వస్తువు అసలు ఉండదు. ఎల్లకాలము అది అనిత్యమైనది. అనిత్యమైనవస్తువు ఎప్పుడూ సత్యముకాదు. నిత్యము సత్యము అయిన వస్తువునే మహర్షులు ఉపాసిస్తారు. మనసులో ఏ భావనలో ఉంటారో, చిత్తమందుకూడా అదే భావన. అంతఃకరణలో అదేభావన చేస్తారు. వాళ్ళు దానిని అట్లాగే ప్రకటిస్తారు.
31. అసత్యంలో ఉండేవాళ్ళు సామాన్యులు, పామరులు. కాబట్టి మనకు ఋషులనుంచీ శిక్షగా వినిపిస్తుంది ఆ మాట. ఆ సత్యానికి దారితెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం వైదిక, ధార్మిక స్వధర్మనిర్వహణ.
32. అట్టి మార్గమే సత్త్వగుణ ప్రధానత కలిగిన మార్గం అని సంప్రదాయం చెపుతోంది. ఆ సంప్రదాయంలో ఉన్న – వేదం చదివిన బ్రాహ్మణుడైనా, కాకపోయినా, సత్య మార్గంలో ఉండేవాడు-ఎవడైనా సరే, తనకు విహితమైన ధర్మమున్నదే – ఆ ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని ఉపాసిస్తే – క్రమంగా ముక్తికి వెళతాడు. అంతేకాని పాండిత్యంచేత, కేవలం కర్మచేత కాదు.
‘నకర్మణా న ప్రజయా ధనేన| త్యాగేనైకే అమృతత్త్వమానశుః‘ –
అమృతత్త్వం అంటే సత్యమే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
22 Sep 2020
No comments:
Post a Comment