🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 7 🌻*

16. అత్యంత పరిమితమైన అభావము అభివ్యక్తమైనప్పుడు దాని ఆవిష్కారం క్రమక్రమముగా బయటకి నిగి నిగిడి అనంతముగా వ్యాపించెను.

17. సర్వములో అంతర్నిహితమై యున్నది ఏదైనను అభావమే. సర్వములో చైతన్యం కూడా అభావమై యున్నది

భావము X అభావము
అభావము X ఆభాసము

EVERYTHING X NOTHING
NOTHING X Nothingness
శూన్యం = vacum

Notes: సృష్టి రూపమున వ్యాపాకమై ఉన్న భగవంతుని సృష్టికర్త యనియు, ఈశ్వరుడు అనియు అందురు. ఈశ్వర-శబ్దము, సందర్భము ననుసరించి 'పరమాత్మ' అనికూడా నొప్పును. ఇట్టి ఈశ్వరునకు పరుడు ఎవడు? పరమేశ్వరుడు, పరేశుడు.

పరుడు=ఆవలివాడు (God, the beyond state)
పరాత్పరుడు= పరునకు ఆవలి వాడు (God,the beyond state)
పారాత్ + పరః = పరాత్పరః
(God, The beyond beyond state)
పరుడు=ప్రకృతి మాయను దాటిన వాడు.

బ్రహ్మ=సృష్టికర్త, జగత్కర్త,ఈశ్వరుడు
పరబ్రహ్మము=సృష్టికర్తను మించిన వాడు (పరమాత్ముడు)
ఈశ్వరుడు=జగత్కర్త (Creator)
పరమేశ్వరుడు=(God, the Beyond State of Creation)

18.పరాత్పర పరబ్రహ్మస్థితి అనూహ్యమైన అనన్యమైన పరిశుద్ధ స్వరూపము. సమస్తజ్ఞానము సమస్త అంతర సత్యములు దాగియున్న పరమనిధి. 

అవాంగ్మానస గోచరమైన అవ్యక్తస్థితి. ఇది పరిమితమును గాదు, అపరిమితమును గాదు. సగుణమును కాదు, నిర్గుణమును కాదు. సాకారమును కాదు,నిరాకారమును కాదు. అనంత అగోచర స్థితి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment