🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 3 🌻*

8. అపారము అనంతము దివ్యము పరమము అయిన ఈ కేవల శూన్యత్వములో -

1. చైతన్య స్థితియు లేదు, చైతన్యరాహిత్య స్థితియు లేదు.

2. అపరిమిత అహమ్‌ లేదు (దివ్యాహమ్‌), పరిమిత అహమ్‌ లేదు.

౩. సార్వభౌమిక మనస్సు లేదు, పరిమిత మనస్సు లేదు.

4. అపారమైన శక్తి లేదు. పరిమిత శక్తి లేదు.

5. మహాకారణ శరీరము లేదు. పరిమిత దేహము లేదు.

6. విశ్వములు లేవు, లోకములు లేవు.

చైతన్యమందుగాని లేక, చైతన్యరాహిత్యస్థితి యందు గాని అసలు ఎరుకే లేదు.
ఇది - నిర్గుణ నిరాకారమును కాదు. సగుణ సాకారమును కాదు. 
అక్కడ ఉన్నదే “భగవంతుడు” చైతన్యము “లేదు”. 

9. అపారము, కేవలము (పూర్ణము) అనంత దివ్యశూన్యత్వము (మహాకాశము) అయిన
పరాత్పరస్తితిలో అన్ని గుణములు, అన్ని రూపములు, అన్ని స్పితులు, అణు ప్రమాణ చైతన్యము, అనంతముగా ఎరుకగల అనంత చైతన్యమును; అనంతముగా ఎరుకలేని అనంత చైతన్యమును, అనంత భగవల్లీలయు, తనను తాను తెలిసి కొనవలెననెడి అనంత ఆదిప్రేరణము, భగవంతుని స్వీయ అనంత స్వభావత్రయము, తదితరములు

అన్నియు అంతర్ష్నిహితములై యున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment