మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవతము-అనుభూతి -1 🌻

కలి యుగమున కష్ట జీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.

పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు.

... ..✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

No comments:

Post a Comment