నారద భక్తి సూత్రాలు - 97


🌹.   నారద భక్తి సూత్రాలు - 97   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 68


🌻 68. కంఠావరోధ రోమాశ్చాత్రుభిః పరస్పరం లపమానా 2 పావయని కులాని పృథివీంచ || 🌻

ముఖ్యభక్తి లభించినవారు, ఆ భక్తి విశేషం చేత సంభాషించేటప్పుడు వారి గొంతులో ఆర్ధత జనిస్తుంది. దగ్గుత్తిక కలుగుతుంది. రోమాలు నిక్క పొడుచు కుంటాయి. ఆనంద బాష్పాలు రాలుతాయి. శరీరం గగుర్పాటు చెందుతుంది. ఇవన్నీ బాహ్యంగా కనిపించే సూచనలు.

భక్తుల సర్వావస్థలలో వారు ఏదిచేస్తున్నా భక్తి రసంతో నిండి ఉంటుంది. వీరు భక్తి కథామృతాన్ని గ్రోలుతూ ఉంటారు. వీరీవిధంగా చేస్తూ పాపాత్ములను పునీతులుగా చేస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే భక్తి పారవశ్యంతో భగవంతుని కల్యాణ గుణ కీర్తన చేస్తూ ఉంటారు. దీని వలన ఇతరులు భక్తి మార్గంలో ప్రవేశిస్తారు.

ఇతరులు వారిని బాధలకు గురిచేసినప్పటికీ భక్తిని మానరు. భక్తి ప్రచారం చేస్తూనే ఉంటారు. వారి భక్తిని బట్టి వారిలో వారి చుట్టూ తేజో మండలం వ్యాపించి, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఆకర్షణీయమై ఉంటుంది.

ఈ భాగవతోత్తములు ఎక్కడో గుహాంతరాలలో ఉన్నప్పటికీ సుదూరంలో ఉన్న శుద్ధ మానసుల హృదయాలలో వారి తేజస్సు ప్రతిఫలిస్తూ ఉంటుంది. తద్వారా సామాన్య గౌణభక్తులలో సాధన ఉధృతి కలుగుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

17 Sep 2020

No comments:

Post a Comment