✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 14 🌻
180. నిస్పష్టముగా చెప్పవలెనన్నచో, అసలు ఉన్నది ఒక్కటే రూపము అదియే మానవ రూపము. మానవ రూపము, పూర్వము దాటి వచ్చిన దశలన్నింటిలో అంతర్నిహితమై యున్నది. రూపములుగా కానిపించు తక్కిన రూపములన్ని మానవరూపముయొక్క పరిణామ దశలు.
181. ఆత్మకు మానవరూపము లేకుండా, సూక్ష్మ -కారణ దేహముల చైతన్యముగాని,ఆత్మచైతన్యము గాని పొందుట దుర్లభము.
182. పరమాత్మానుభూతిని పొందుటకు కాంక్షించుచున్న ఆత్మ , మానవరూపము ధరించి పూర్ణ చైతన్యమును సంపాదించి నప్పటికీ , పరమాత్మానుభవమును పొందలేకపోయినది _ ఎందుచేత ?
ఆ - పూర్ణ చైతన్యము స్థూల సంస్కారములలో కేంద్రీకరించి యున్నంతకాలము స్థూల రూపముతోనే ఎఱుక కలిగియుండును కనుక విధిగా భౌతికలోకాను భవము పొందితీరవలసినదే .
183. తెలిసిన స్థితిలో ( జాగృతి లో ) మనస్సే _మానవుడు .
దేహమే _మానవుడు .
తెలియని స్థితి లో ( సుషుప్తి లో ) మనస్సుకు దేహమునకు
ఆవలి నున్న ఆత్మ యే మానవుడు .
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
17 Sep 2020
No comments:
Post a Comment