🌹. శివగీత - 65 / The Siva-Gita - 65 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము
🌻. గర్భో త్పత్త్యాది కథనము - 11 🌻
హిక్కయా బాద్య మానస్య - శ్వాసేన పరి శుష్యతః
మృత్యునా కృష్య మాణస్య - ణ కల్వస్తి పారాయణమ్ 61
సంసార యంత్ర మారూడో - యమదూతై రధిష్టితః
క్వయాస్యా మీతి దుఃఖార్త - కాలపాశేన యోజితః 62
కిం కరోమి? క్వగ చ్చామి? - కిం గృహ్ణామి? త్యజామి కిమ్?
ఇతి కర్తవ్యతా మూడ - కృచ్చ్రాద్దే హాత్త్య జత్య సూన్ 63
యాత నాదే హ సంబద్దో - యమదూతై రధిష్టితః,
ఇటో గత్వాను భవతి - యాయా స్తా యమయాతనాః 64
తాసు యల్లభ తే దుఃఖం - త ద్వక్తుం సహతే కుతః
కర్పూర చందనా ద్యైస్తు - లిప్యతే సత తం హియత్ 65
భూషణై ర్భూష్యతే చిత్రై: సునస్రై: పరివార్యతే,
అస్పృశ్యం జాయతే ప్రేక్ష్యం - జీవత్యక్తం సదావపు: 66
ఎక్కిళ్ళతో గట్టబడిన వాడై, శ్వాశలతో నిండిన, మృత్యువు చేత నాకర్షితుడైన వాడికి రక్షకమైన దేదియు లేదు కదా! సంసార యంత్రమున (చక్రమున) అధిష్టించి (ఎక్కిన)న వాడు, యమకింకరులతో నాక్రమించిన వాడు, ఎక్కడికి వెళ్ళుదును.
ఏమి చేయుదును అని అతీవశోక సంతప్తుడై యమపాశముచేత బంధించబడును. నేనెక్కడికి వెళ్ళుదును, ఏమి చేయుదును, ఏమి గైకొందును, దేనిని విడుటును అని ఆలోచిస్తూ తానూ చేయబోవు పనిలో (కింకర్తవ్యతా మూడుడై) అతి కష్టముతో తన యసువులను వదలును.
తరువాత యమయాత నలననుభవించు దేహము కలవాడై యిక్కడి నుండి వెళ్లి యమపురికి ఆయా యమయాతనలను బొందును. ( యమ యాతనలు అనగా యమ పట్టణములోని కష్టములలోని యే ఒక్క దానిని కూడా పేర్కొనుటకు శక్తి జాలిమి ఇక ఆయాతనల దుఃఖముల నెవడు వర్ణింపగలడు?
ఏ శరీరమైతే కర్పూర చందనాదులతో పూయబడుచుండునో చిత్ర విచిత్రమైన అలంకారములచేత నలంక రించబడెనో, విలువైన వస్త్రములతో కపబడెనో అలాంటి శరీరము అసువులను బాయగా, ముట్టదగనిది, చూడదగనిదే యగును. ఒక్క క్షణమైనను ఆలాస్యము చేయకుండా ఇంటి నుండి వెడలింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 65 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 11 🌻
Taking painful hiccups, getting dragged away by death; for such a man what is there as protection? One who rides on the machine called Samsaara (worldly life), one who is clasped by the Yama's attendants, where is the way to freedom for him?
And with too many outstanding questions in mind, that Jiva leaves his body painfully. After that he enters 'Yatana Deham' (body of suffering) in the hell and suffers from various tortures and punishments in hell.
And the body which he left, which he used to smear sandalwood paste fondly once upon a time, that body which used to get decorated with silk clothes, and ornaments, such a dead body becomes an object of despise.
And without any further delay it gets taken away out of the house.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment