✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 71
🌻 71. మోదన్తె పితరో, నృత్యన్తి దేవతాః సనాధాచేయం భూర్భవతి 🌻
ముఖ్యభక్తుని వంశంలోని పితృ దేవతలందరు సంతోషిస్తారు. అతడి కారణంగా దెవతలు ఆనందిసారు. అతడు భూమిమీద నివసించడం వలన భూమి సురక్షితమవుతున్నది. అందువలన భూమిమీద నివసించి అందరూ క్షేమంగా ఉందగలుగుతున్నారు. ప్రకృతి విపత్తులు రావడం లేదు. అతివృష్టి అనావృష్టి వలన నష్టం ఉండటంలేదు. కరువు కాటకాలు లేవు.
పితృ బుణం కర్మకాండగా తీర్చడం లోక సహజం. కాని ముఖ్య భక్తుల విషయంలో అతడి వంశంలోని పితరులందరికీ సర్వవిధ బుణాలు వాటంతట అవే తీరిపోతాయి. ఆ వంశంలో కర్మకాండ అవసరం ఉండదు.
దేవతలు యజ్ఞ యాగాదుల వలన తృప్తి పడతారు. కాని ముఖ్య భక్తుని విషయంలో యజ్ఞ యాగాదులు లేకుండానే తృప్తిచెంది ఉంటారు. యజ్ఞ శేషం దేవతలకు దానంతట అదే చెరుతుంది.
పాపాత్ములను ధరించే ధరణి ఆ పాపాన్ని మోయలెక ఉపద్రవానికి లోనవుతుంది. ముఖ్యభక్తుని ఉనికి వలన ఆ భూమి తిరిగి సురక్షిత మవుతుంది. అప్పుడు ఏ ప్రమాదం ఉండదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
20 Sep 2020
No comments:
Post a Comment