శ్రీ విష్ణు సహస్ర నామములు - 16 / Sri Vishnu Sahasra Namavali - 16


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 16 / Sri Vishnu Sahasra Namavali - 16 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻 🌻

మేషరాశి - రోహిణి నక్షత్ర 4వ పాద శ్లోకం


16. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||


141) భ్రాజిష్ణుః -
స్వయంప్రకాశకుడు, జ్ఞాన సాధనచే అవగతమగువాడు.

142. భోజనం -
కర్మ, జ్ఞాన ఇంద్రియాలతో స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ వస్తువులు).

143. భోక్తా -
భుజించువాడు, భోజనమనబడు ప్రకృతిని పురుషునిగా స్వీకరించువాడు.

144. సహిష్ణుః -
సహించువాడు, దుష్టులను సంహరించువాడు.

145. జగదాదిజః -
జగముల కంటే ముందుగా నున్నవాడు, ఆది పురుషుడు.

146. అనఘః -
కల్మషము లేనివాడు.

147. విజయః -
విజయమే స్వభావముగ కలవాడు.

148. జేతా -
ఇచ్ఛామాత్రమున అంతా జరిపించువాడు.

149. విశ్వయోనిః -
విశ్వ ఆవిర్భావానికి కారణమైనవాడు.

150) పునర్వసుః -
సకల దైవముల అంతరాత్మగా విరాజిల్లువాడు, ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Vishnu Sahasra Namavali - 16   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


16. bhrājiṣṇurbhōjanaṁ bhōktā sahiṣṇurjagadādijaḥ |
anaghō vijayō jetā viśvayōniḥ punarvasuḥ || 16 ||


141) Bhrājiṣṇuḥ:
One who is pure luminosity.

142. Bhojanam:
Prakruti or Maya is called Bhojanam or what is enjoyed by the Lord.

143. Bhoktā:
As he, purusha, enjoys the prakruti, He is called the enjoyer or Bhokta.

144. Sahiṣṇuḥ:
As He suppresses Asuras like Kiranyaksha, He is Sahishnu.

145. Jagadādhijaḥ:
One who manifested as Hiranyagarbha by Himself at the beginning of creation.

146. Anaghaḥ:
The sinless one.

147. Vijayaḥ:
One who has mastery over the whole universe by virtue of his six special excellences like omnipotence, omniscience etc. known as Bhagas.

148. Jetā:
One who is naturally victorious over beings, i.e. superior to all beings.

149. Viśvayoniḥ:
The source of the universe.

150) Punarvasuḥ:
One who dwells again and again in the bodies as the Jivas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2020

No comments:

Post a Comment