📚. ప్రసాద్ భరద్వాజ
🌻 14. పురుషః, पुरुषः, Puruṣaḥ 🌻
ఓం పురుషాయ నమః | ॐ पुरुषाय नमः | OM Puruṣāya namaḥ
:: మహాభారతము శాంతి పర్వము ::
నవద్వారం పురం పుణ్య - మేతైర్భావైః సమన్వితం ।
వ్యాప్య శేతే మహాత్మా య స్తస్మాత్పురుష ఉచ్యతే ॥ 21.37 ॥
పురం అనగా శరీరము. పురే శేతే ఇతి పురుషః - పురమునందు శయనించు వాడు. లేదా సృష్టికిని పూర్వమునందే ఉండెను అను అర్థమున పురా - అసిత్ - అను విగ్రహవాక్యమున (ధాతువగు 'అస్' (ఉండు) అనుదానిని వెనుక ముందులుగా మార్చగా పురా + అస్ > పురా + స్ అ > పురా - స > పుర - ష =) పురుష అగును. 'పూర్వమేవాఽహ మిహాస మితి - తత్ పురుషస్య పుర్షత్వమ్' - ఇతః పూర్వమే నేను ఇక్కడ ఉంటిని' అను అర్థమున ఏర్పడుటయే 'పురుష' శబ్దపు అర్థమునందలి పురుషత్వము.
'అంతటను అన్నియును తానై నిండి యుండుటచే లేదా అన్నిటిని తన శక్తితో నింపుటచే అన్నిట చేరియుండుటచే ఆ హేతువు వలన ఈ పరమాత్ముడు 'పురుషుడు' అని చెప్పబడుచున్నాడు' అను పంచమవేద వచనము (ఉద్యోగ - 70:11) ప్రమాణము.
:: భగవద్గీత - అక్షరపరబ్రహ్మ యోగము ::
అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ॥ 8 ॥
ఓ అర్జునా! అభ్యాసమను యోగముతో గూడినదియు, ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత, అప్రాకృతుడైన సర్వోత్తముడగు పరమపురుషుని మరల స్మరించుచు మనుజుడు వారినే పొందుచున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 14 🌹
📚. Prasad Bharadwaj
🌻 14. Puruṣaḥ 🌻
OM Puruṣāya namaḥ
Mahābhārata - Śānti parva
Navadvāraṃ puraṃ puṇya - metairbhāvaiḥ samanvitaṃ,
Vyāpya śete mahātmā ya stasmātpuruṣa ucyate. (21.37)
The great being resides in and pervades the mansion of the body, having all the features described before and provided with nine gateways; because of this He is called Puruṣa.
Or by interpreting the word as purā āsit, the word can be given the meaning of 'One Who existed always.' Or it can mean one who is pūrṇa, perfect; or one who makes all things pūrita i.e., filled by pervading them.
Bhagavad Gitā - Chapter 8
Abhyāsayogayuktena cetasā nānyagāminā,
Paramaṃ puruṣaṃ divyaṃ yāti pārthānucintayan. (8)
O Son of Pr̥thā, by meditating with a mind which is engaged in the yoga of practice and which does not stray away to anything else, one reaches the supreme Person existing in the effulgent region.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
20 Sep 2020
No comments:
Post a Comment