శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 4 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ

చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత

🌻 4. “చిదగ్నికుండ సంభూతా” 🌻

చిదగ్ని యను కుండము నుండి పుట్టినది అని అర్ధము. పరతత్త్వము నుండి ఏర్పడిన మొదటి సంకల్పమే యజ్ఞకుండము. అందుండియే సమస్త సృష్టి ఏర్పడును. సంకల్ప మెర్పడగానె చైతన్యము కూడ ఏర్పడును. ఆ చైతన్యము కోటి సూర్యులను మించిన అగ్నిగా వ్యక్తమగును.

సృష్టి యజ్ఞకుండమున చైతన్యాగ్ని ఈ విధముగ ఉదృవించును. అందుండి సమస్త లోకములు, ఆ లోకములందుండు జీవులు ఉద్భవింతురు. ఉధృవించిన సమస్త లోకములయందు, లోకుల యందు కూడ చైతన్యమను అగ్ని అంతర్హితముగ నున్నది. ఏ అగ్ని నుండి ఈ సమస్తము ఉద్భభవించినదో ఆ చైతన్యాగ్ని కూడ పరబ్రహ్మ స్వరూపిణియైన దేవి నుండి సంకల్పమాత్రముగ ఉద్బవించినదని భావన.

మానవుడు నిద్ర నుండి మెల్కాంచుట ప్రతినిత్యము జరుగు చున్నది. స్థితి లేక సత్యము నందున్నటువంటి తత్త్వము చైతన్యముగ మెల్మాంచుచున్నది. ఈ మెల్కొనుటకు వలసిన సంకల్పము మానవుని ఎరుకలో లేదు. అంతర్హితముగ నున్న తత్త్వము నుండి ప్రేరణ (సంకల్పము) కలిగి, చైతన్యవంతుడుగ మెల్కాంచుచున్నాడు. ఇట్లు సత్యవంతుడు చైతన్యవంతుడగు చున్నాడు. అట్లే పెంజీకటి కవ్వలనున్న తత్త్వము (తమనః వరస్తాత) ఈ మొదటి సంకల్పమును వ్యక్తముజేసి, దాని నాధారముగ గొని చైతన్వాగ్నిగ వ్యక్తమగును.

మెల్మాంచిన మానవుని నుండి మరల సంకల్పములు కలిగి, తన చుట్టును తన జీవితమను సృష్టి నేర్చరచుకొనుచున్నాడు.

అట్లే పరతత్త్వము నుండి సంభవించిన చైతన్యమను అగ్నికూడ మెల్మొనబడినదై సృష్టి కార్యమునకు పూనుకొనును. చైతన్యాగ్ని సంభవించగనే తమస్సను చీకటి హరింపబడి, వెలుగు వ్యాపించును. సత్యవంతుడు చైతన్యవంతుడగుట కూడ తమస్సు (నిద్ర) నుండి పరతత్త్వము చైతన్యముగా మెల్కాంచుటయె. ఇట్లు మెల్మ్కాంచిన తత్త్వము మరల పరతత్త్వములోనికి కాలగతిని యిమడగలదు. అనగా మరల తమోగుణము ఆవరింపగలదు. రాత్రి ఏర్పడగనే జీవులన్నియు నిద్ర యను తమస్సులోనికి తీసుకొనబడి పోవుచున్నవి కదా! కావున యజ్ఞార్థమై

సృష్టి నిర్మాణము చేయుటకు చైతన్వాగ్నిగ సంకల్పము నుండి వ్యక్తమగుట, మరల తిరోధానము చెందుట అనునవి పరతత్త్వ మాధారముగ జరుగుచున్నవి.

తమస్సు కవ్వలనుండు తత్త్వము తమస్సును భేదించు కొని రజస్సుగ నుదృవించును. తిరోధానమున మరల రజస్సును తమస్సు హరించుకొనును. ఆ తమస్సున కవ్వల స్టితి యున్నది. ఆ తమస్సున కివ్వల కూడ స్థితి యున్నది. తమస్సున కివలి స్ధితి సత్త్వగుణము నాశ్రయించి యుందును. తమస్సున కవ్వలిస్థితి త్రిగుణ ములకును ఆశయము.

ఈ చిదగ్ని శోక మోహములను దహింపగలదు. ఇది సమస్త ధర్మములను ధరించియుండును. దీనిని చెరుటయే దేవిని చేరుట. సంభూత అని చెప్పుటలో ఉన్నదే వ్యక్తమైనదని అవగాహన సమ్యక్‌+భూతు. చైతన్యాగ్ని రూపముగ వ్యక్తమగుటకు పూర్వము ధర్మముగ పరతత్త్వమున నున్నదియె కాని, పుట్టినదని అర్ధము కాదు.

అనగా దేవి యొక్క శాశ్వతత్త్వము సంభూతా అను పదముతో అద్భుతముగ ప్రతిపాదింపబడినది. భూతమనగా ఉన్నది వ్యక్తమైనదని అర్ధము. అనగా గుణాతీత తత్త్వము సగుణమైనదని గ్రహింపవలెను. ఈ నామము అష్టాక్షరీ నామము కనుక ఏడు లోకములకు ఆశ్రయము నిచ్చు ఎనిమిదవది అని కూడ గ్రహింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹    Sri Lalitha Chaitanya Vijnanam - 4   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 4. Cidagnikuṇḍa-saṃbhūtā चिदग्निकुण्ड-संभूता 🌻

Cit + agni + kuṇḍa + saṃbhūta. Cit means the nirguṇa Brahman or the Brahman without attributes (the foundational consciousness). Agni kuṇḍa means a fire altar, in which fire sacrifices are done by offering oblations. Saṃbhūtā means born. Agni kuṇḍa or the fire altar means the dispeller of darkness.

Darkness means lack of knowledge or ignorance which is called a-vidyā (vidyā means knowledge). This should not be interpreted as the one who was born out of the fire.

She is the supreme consciousness who dispels ignorance. She dispels ignorance through Her form of pure consciousness, who illuminates within, dispelling the darkness of māyā.

The same explanation is given by Kṛṣṇa in Bhagavad Gīta (IV.37), “Like a fire turning the fire logs into ashes, the fire of knowledge burns to ashes all the karma-s (sarva karmani).”

Complete knowledge of the pure Brahman residing within, destroys all our karma-s whether good or bad. One should have no balance in karmic account to avoid further births.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

20 Sep 2020

No comments:

Post a Comment