రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 3 🌻
ప్రాప్నుయాం ఫలమేతస్య పాపస్య స్వఘ కారిణీ | తచ్ఛోధన ఫలమహా మాశు చే చ్ఛామి సాధనమ్ || 25
యున్మాం పితా భ్రాతరశ్చ సకామమపరోక్షతః | దృష్ట్వా చక్రుః స్పృహాం తస్మాన్న మత్తః పాపకృత్పరా || 26
మమాపి కామభావోsభూ దమర్యాదం సమీక్ష్యతాన్ | పత్యా ఇవ స్వకే తాతే సర్వేషు సహజేష్వపి || 27
కరిష్యామ్యస్య పాపస్య ప్రాయశ్చిత్తమహం స్వయమ్ | ఆత్మాన మగ్నౌ హోష్యామి వేదమార్గానుసారతః || 28
ఈ పాపమును చేసిన నేను కూడా ఈ పాపఫలమును పొందగలను. కాని నేను వెంటనే ఆ పాపమును క్షాళన చేయగలిగే సాధనమును స్వీకరించ గోరు చున్నాను (25).
నన్ను ప్రత్యక్షముగా చూచిన నా తండ్రి, మరియు సోదరులు కామ వికారములను పొంది నారంటే, నాకంటె పెద్ద పాపాత్మురాలు ఉండబోదు (26).
మర్యాద లేకుండగా నాతండ్రిని, సోదరులనందరినీ చూచిన నాకు కూడా కామభావము అంకురించెను (27).
నేను ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును స్వయముగా చేసుకొనగలను. నేను వేద ధర్మముననుసరించి నా దేహమును అగ్నిలో హోముము చేయగలను (28).
కిం త్వేకాం స్థాపయిష్యామి మర్యాదామిహ భూతలే | ఉత్పన్న మాత్రాన యథా సకామమాస్స్యుశ్శరీరిణః || 29
ఏతదర్థ మహం కృత్వా తపః పరమ దారుణమ్ | మర్యాదాం స్థాపయిష్యామి పశ్చాత్త్యక్ష్యామి జీవితమ్ || 30
యస్మిన్ శరీరే పిత్రా మే హ్యభిలాషస్స్వయం కృతః | భ్రాతృభిస్తేన కాయేన కించిన్నాస్తి ప్రయోజనమ్ || 31
మయా యేన శరీరేణ తాతే చ సహజేషు చ |ఉద్భావితః కామభావో న తత్సు కృత సాధనమ్ || 32
అట్లు చేసి నేను ఈ భూమండలమునందు ఒక మర్యాదను స్థాపించగలను. అది యేదన, మానవులు పుట్టుకతోడనే కామవికారములను పొందకుందురు గాక! (29).
దీని కొరకై నేను పరమ ఉగ్ర తపస్సును చేసి, తరువాత ప్రాణములను విడిచి, మర్యాదను నెలకొల్పగలను (30).
ఏ శరీరమునందు నా తండ్రి, మరియు సోదరులు స్వయముగా కామ వికారమును ప్రదర్శించినారో, అట్టి ఈ శరీరముతో నాకు ప్రయోజనము లేశ##మైననూ లేదు (31).
ఏ శరీరముచే నేను తండ్రి యందు సోదరులయందు కామ వికారమును ఉద్బుద్ధము చేసితినో, ఆ ఈ శరీరము ధర్మసాధనము కాజాలదు (32).
ఇతి సంచింత్య మసా సంధ్యా శైలవరం తతః | జగామ చంద్రభాగాఖ్యం చంద్రభాగాపగా యతః || 33
అథ తత్ర గతాం జ్ఞాత్వా సంధ్యాం గిరివరం ప్రతి | తపసే నియాతాత్మానం బ్రహ్మావోచ మహం సుతమ్ || 34
వశిష్ఠం సంయతాత్మనం సర్వజ్ఞం జ్ఞానయోగినమ్ | సమీపే స్వే సమాసీనం వేద వేదాంగ పారగమ్ || 35
సంధ్య ఇట్లు తలపోసి, తరువాత చంద్ర భాగానదీ తీరము నందు గల చంద్ర భాగపర్వతమునకు వెళ్లెను (33).
అపుడు బ్రహ్మనగు నేను, సంధ్య తపస్సు కొరకు ఆ పర్వత రాజమునకు వెళ్లినదని యెరింగి, నాకుమారుడు (34),
ఇంద్రియనిగ్రహము గల వాడు, సర్వజ్ఞుడు, జ్ఞాన యోగి, వేదవేదాంగముల పారమును చూచిన జ్ఞాని యగు వసిష్ఠుని దగ్గర కూర్చుండ బెట్టుకొని, ఇట్లు పలికితిని (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
20 Sep 2020
No comments:
Post a Comment