భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 114


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 114 🌹


🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. మతంగ మహర్షి - 2 🌻


10. ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పాపము, హింస మొదలైన వాటిని ఎవరైనాచూస్తే, మళ్ళీ మనుష్యుడై భారతీయుడుగా పుట్టటానికి భయపడతాడు.


11. ఏ క్షేత్రంలోనో, ఏ గంగాతీరంలోనో పక్షిగా జీవించి ముక్తిపొందాలిని కోరుకోవటం నేటి ఈ భారతదేశంలో మరింత సమంజసం. ఎందుచేతనంటే, ఈ సమిష్టిపాపాన్ని ఏ ఒక్కరమూ పరైహరించలేము. దానిని కట్టడిచేయలేము. చూస్తూ ఊరుకుంటే దుఃఖహేతువవుతుంది అది. అశక్తులం. మనకు ఈ వేదన ఉన్నప్పుడు తపస్సు కొనసాగదు.


12. అందుకని ఏ విషయములు, ప్రపంచజ్ఞానము లేనటువంటి పక్షిజన్మను ఏ క్షేత్రంలోనో, ఏదో ఆశ్రమంలోనో ఎక్కడో ఏ చెట్టునీడనో తీసుకుని అక్కడ జీవిస్తాను, ఈ జన్మ చివరి జన్మ అగునుగాక! అని భావిస్తారు.


13. మతంగమహర్షి కొన్నివేల సంవత్సరములు తపస్సుచేయగా, మొదటగా ఇంద్రదర్శనం అయింది. మతంగుడు తనను బ్రహ్మవిద్వద్వరునిగా అనుగ్రహించమని కోరాడు.


14. ఇంద్రుడు ఆయనతో, “మతంగా! వరుసగా ఎన్నో జన్మలలో బ్రాహ్మణుడవై పుట్టిఉంటేనే బ్రహ్మవిద్వద్వరుడవు అవుతావు. అందువల్ల మరొక వరమేదైనా కోరుకో అన్నాడూ మతంగుడు ఒప్పొకోలేదు. అయితే మతంగుడు ఈ సారి ఏకపాదంపై నిలిచి వంద సంవత్సరాల పాటు తపస్సు చేసాడు.


15. మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై, “ఓ మతంగా! బ్రహ్మవిద్వద్వరుడివికావటం నీ తరంకాదు. ఇంతకు నూరురెట్లు తపస్సుచేస్తే చండాలుడు శూద్రుడవుతాడు.


16. దానికి నూరురెట్లు అధికంగా తపముచేస్తే శూద్రుడు వైశ్యుడవుతాడు. దానికి వేయిరెట్లు అధికంగా తపస్సుచేస్తే వైశ్యుడు క్షత్రియుడవుతాడు. దానికి పదివేలరెట్లు అధికంగాచేస్తే క్షత్రియుడు దుర్బ్రాహ్మణుడవుతాడు. జీవలక్షణం నీలో ప్రవేశిస్తుంది. ఆ పదివేలరెట్లు తపస్సుచేస్తే సామాన్య బ్రాహ్మణలక్షణం నీకు రావచ్చును. బ్రాహ్మణలక్షణం అంటే సత్త్వగుణంతో కూడుకున్నదని అర్థం.


17. వీటిలో రెండంతస్తులు. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న దౌర్బ్రాహ్మణ్యం పోవాలి. పూర్వం చేసిన పాపంవలన నీ జీవలక్షణంలో చండాలత్వం ఉన్నది. అది పోవాలంటే చిరకాలం తపస్సు చేయాలి.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


20 Sep 2020

No comments:

Post a Comment