నారద భక్తి సూత్రాలు - 106



🌹.   నారద భక్తి సూత్రాలు - 106   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 76

🌻 76. భక్తిశాస్తాణి మననీయాని త(దు)ద్బోధక కర్మాణి కరణియాని ॥ 🌻

సాధకులు భగవంతుడి పట్ల భక్తి ప్రేమలను గూర్చి వివరించే శాస్త్రాలను విశ్లేషించి, మననం చెస్తూ ఉండాలి. భక్తి ప్రమలను ప్రబోధించి భగవత్మథలను వినాలి, వారి నిత్య కర్మలలో ఆ ప్రమ ప్రతిఫలించాలి.

భక్తి శాస్త్రమంటెే భాగవతం, భగవద్గీత, నారద పాంచరాత్రం, భక్తి రసనాయనం మొదలగునవి. నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు మొదలగునవి కూదా. భక్తుల చరిత్రలు, పురాణ కాలానివి, ఈ మధ్య కాలానివి కలిపి పఠించాలి. ఈ పఠన, శ్రవణ, మననాల వంటి కర్మలు, పవిత్ర కర్మలవడంచేత శుభవాసన ఎర్పడుతుంది. దానివలన సుకృత విశేషం కలిగి, భక్తి పక్వమై పండుతుంది.

భక్తిక్రియా వివరాలు, సాధనా క్రమం, శాస్త్రియ పద్ధతి మొదలైనవి తెలియడమే గాక, పూర్వ భక్తుల సాధన, సాధ్యాలను ఉదాహరణగా సందేహ రహితంగా, అభ్యాసం చేయడానికి వీలవుతుంది. శ్రద్ధ, విశ్వానాలు కలుగుతాయి.

భాగవత కథాగానం, సంకీర్తనం చేయాలి, వినాలి. కాలక్షేపానికైనా సరే నిరంతరం చేస్తూ పోతె భక్తి దానంతట అదే కలిగి, వృద్ది చెందుతుంది. భక్తి పురోగమనం మాట ఎలా ఉన్నా ఈ క్రియల వలన ఇతరమైన అవాంఛిత కర్మల నుండి దూరమవుతాడు.

ఆళ్వారుల భక్తి కీర్తనలు, గోదా దేవి పాశురాలు, తుకారాం, రామదాసు పాటలు, అన్నమయ్య పదాలు, కబీరు గీతాలు, జయదేవుని అష్టపదులు, త్యాగరాయ కీర్తనలు మొదలైనవి విని, పాడుతూ, అనుసరిస్తూ తన్మయమైతే అదీ భక్తే. ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు మొదలైన భాగవతంలోని భక్తులకు సంబంధించి, శ్రీ బమ్మెర పోతన కవి రచించిన పద్యాలను వల్లె వేస్తే మంచిది. ఉదయాస్తమానం భక్తి రసం పొంగేటట్లు ఏది బాగుంటె దానిని తనకిష్టమైనట్లు భక్తుడు సాధనగా చేస్తే అతడు ముఖ్యభక్తుడవుతాడు. కనుక ఈ విధమైన శుభ కర్మలు నిరంతరం చేస్తూ ఉండాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

No comments:

Post a Comment