సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము 🍀
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల
🌻 10. 'మనోరూపేక్షుకోదండా' 🌻
ఇక్షు కోదండమనగా చెఱకువిల్లు. జీవుని మనస్సు రూపమున దేవియే ఈ విల్లును ధరించియున్నది. చేతన దేవియైనపుడు అందుండి వ్యక్తమైన మనస్సు ధరించు కోరిక కూడ ఆమె ఆధారముగ నున్నదియే
కదా! జీవి మనసుయందు ఏర్పడు వేలాది సంకల్ప వికల్పములు యిచట సూచింపబడుచున్నవి.
మనసునకు కలుగు ఈ సంకల్ప వికల్పములకు చైతన్యమే ఆధారము. దేవి విశ్వాత్మ చైతన్యమే. ఆ
చైతన్యమే ప్రతి జీవియందును జీవచైతన్యముగ భాసించుచుండును. దాని ఆధారమున జీవుల మనస్సుల నుండి చిత్తప్రవృత్తులు వ్యక్తమగు చుండును.
దేవి హస్తమందలి చెఱకు విల్లు, భక్తుడు తన మనస్సుగా భావింపవలెను. తన మనస్సు అనెడి విల్లు దేవి అధీనమున నున్నదని ధ్యానింపవలెను. దేవికి సమర్పణ చేయబడిన మనస్సుగా తన మనస్సును మలచుకొనవలెను. ఆమె అధీనముననున్న తన మనస్సు చెఱకు రసము వలె జీవిత సారమును రుచి చూపించగలదు. ఆమె అధీనమున నిలువని మనస్సు వివిధములైన వికారములను పొందుచుండును.
చెఱకు తీపి తెలిసిన మానవుడు దానినే మరల మరల పొందుటకు ప్రయత్నించునట్లే దేవి అధీనమున చేరిన మనస్సు అదే విధముగ ఆమె సాన్నిధ్యమందు చేరుటకు ప్రయత్నించగలదు. ఒకవైపు పాశము, మరియొకవైపు అంకుశము.
డోలాయమానముగ జీవిని త్రిప్పలు పెట్టుచుండగా అలసట చెందిన మనస్సునకు ఇక్షుదండము ఉపాయమును సూచించు చున్నట్లు దేవి రూపమును ఇచట ప్రస్తుత పరచబడినది.
“నా వలెనే నీ మనస్సు కూడ దేవుని అధీనమున నిలుపుము. అప్పుడు పాశము, అంకుశము బారినుండి నీవు రక్షింపబడుదువు”
హస్తమునందలి ఇక్షుదండము బోధించుచున్నదని
గ్రహింపవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 10 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 10. Manorūpekṣu-kodaṇḍā मनोरूपेक्षु-कोदण्डा 🌻
Mind involves both saṃkalpa and vikalpa. Saṃkalpa means resolve, process of thought. Vikalpa means difference of perception.
Both are opposite to each other. Mind is also subtle like knowledge. Mind is reflected through the five sensory organs.
It has both saṃkalpa and vikalpa quality as it acts through the impressions received from sense organs that get fine tuned in the form of thought and finally explodes in the form of actions.
Ikṣu means sugar cane and kodaṇḍa means a bow. She is holding in Her left lower arm a bow of sugar cane.
Why sugarcane bow? If sugarcane is crushed, sweet and tasty juice is obtained from which sugar is manufactured.
It means if one crushes his mind (controlling the mind), he gets the sweet reality of the Brahman. This arm is represented by Mantrinī also known Śyāmala Devi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
26 Sep 2020
No comments:
Post a Comment