కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 62


🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 62  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 26 🌻

సూర్యుని నుంచే నవగ్రహాలకు శక్తి అందుతోంది కాబట్టి, నవగ్రహాలు సూర్యుడి చుట్టూతానే పరిభ్రమిస్తున్నాయి కాబట్టి, దేనియొక్క ప్రభావం చేత ఈ ఆకర్షణా బలం అంతా ఏర్పడింది, దేనియొక్క ప్రభావం చేత ఇవి సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అనే పరిశోధనలో భాగంగా సూర్య శక్తిని నాద శక్తిగా మార్చి మనం గమనించినట్లయితే అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు.

అంటే నాదము బిందువు కళ ఈ మూడింటియొక్క సంయుక్త బిందువే సూర్యుడు అనేటటువంటి లక్షణాన్ని మనం గుర్తించగలుగుతున్నాము. ఒకే బిందు స్థానం నుండి నాదము, కళ - ప్రకాశ వస్తువైనటువంటి ప్రకాశము, అలాగే నాదమూ - ఈ రెండూ కూడా ఒక స్థానమునించే ఉత్పన్నమవుతున్నాయి.

ఆ స్థానము పేరు బిందువు. ఆ బిందు స్థానమే సూర్యుడు. ఆ సూర్య బిందు స్థానమునుంచే సృష్టి అంతా ఉత్పన్నమవుతున్నది. ఆ నాదం పేరు ‘ప్రణవ నాదం’ అనేటటువంటి నిర్ణయాన్ని నేటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకి వచ్చారనమాట. కాబట్టి ఇది ఏనాటిదో.

మనకి లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే భూమి ఏర్పడినప్పటినించీ మన ఋషులు వేదప్రోక్తమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి సృష్టి ప్రమాణమైనటువంటి విధానంతో ఈ ఓంకార తత్వము - సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం అనే భాగంగా ఈ ఓంకార తత్వ విచారణ అనేటటువంటి దానిని ప్రతియొక్క ఆధ్యాత్మవాదులు, ఆధ్యాత్మిక సాధకులు, ఆత్మ వస్తువును తెలుసుకోవలనే ప్రయత్నంచేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓంకార తత్వ విచారణని తప్పక చేయవలసిన అవసరం వున్నది.

దీనియందు పూర్తి అవగాహనా కలిగి వుండాలి. పూర్తి అనుసంధానమూ కలిగివుండాలి. పూర్తి నిమగ్నమైనటువంటి చిత్త ఏకాగ్రత కూడా కలిగి వుండాలి. ఈ మూడూ ఒక్కచోట కలిసినప్పుడు మాత్రమే ఈ ఓంకార తత్వములో సాధకుడు ప్రవేశించగలుగుతున్నాడు.

జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అధిగచ్చతి అనే నాలుగు విధములుగా తెలుసుకొనుట, దర్శించుట, ప్రవేశించుట, అధిగమించుట వంటి విధానములతో ప్రతి ఆధ్యాత్మిక స్థితిలోనూ అంతర్ముఖ ప్రయాణం చేసేటటువంటి ప్రతి సాధకుడూ కూడా ఆ యా ఆంతరిక పరిణామ స్థితులను ఈ నాలుగు పద్ధతులుగా చేరుకొని పరిణమించి దాటుతూ వుంటాడు.

కాబట్టి ఈ ఓంకార తత్వము గురించి సమగ్రమైన అవగాహన దాని యొక్క విశేషణం, దాని యొక్క విశిష్టత, అది పరమాత్మ తత్వమునకు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందటానికి సరాసరి అయినటువంటి రాచబాట. సరాసరి అయినటువంటి మార్గం. సూటిగా వెళ్ళేటటువంటి మార్గం.

కానీ నిదానంగా పరిణామం వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ [All of sudden] గా ఈ రోజు పొద్దున ఓంకారం చెప్తే సాయంకాలానికల్లా ఈ పరబ్రహ్మ తత్వము తెలియబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ ఓంకార తత్వము గురించి పూర్ణమైనటువంటి అవగాహన కలిగి వుండాలి. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

No comments:

Post a Comment