✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 83
🌻 83. ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయాః ఏకమతాః కుమార - వ్యాస - శుక - శాండిల్య - గ - విష్ణు - కౌండిన్య - శేషోద్ధవారుణి - బలి - హనుమద్ విభీషణాదాయో భక్త్యాచార్యాః || 🌻
ఈ క్రింది వారు భక్తి శాస్త్రానికి ఆచార్యులుగా గుర్తించబడినవారు. సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గుడు, విష్ణువు, కౌండిన్యుడు, శేషుడు, ఉద్దవుడు, ఆరుణి, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు మొదలైనవారు. వీరంతా భక్తే ముక్తి మార్గమని ఘంటా పథంగా చాటి చెప్పినవారు. గొప్ప భక్తులు చాలామందే ఉన్నారు. కాని వారిలో భక్తిశాస్త్రాన్ని చాటి చెప్పినవారు కొందరే. అందులోనూ మనకు లభించే శాస్త్రాలు ఇంకా తక్కువే. నారదులవారు తన గురించి తాను చెప్పుకోలేదు గాని, నారద మహర్షి కూడా అట్టి ఆచార్యులలో ఒకరు.
ఈ శాస్త్రం ప్రయోజనమేమంటే గౌణభక్తినీ, బాహ్యభక్తినీ మాత్రమే నిజమైన భక్తిగా భావించేవారు చాలామంది ఉన్నారు. వారందరికి ఈ విషయం చక్కగా తెలియాలి. సాధన మార్గం కూడా తెలియాలి. అది ముక్తి లక్ష్యంగా తెలిసి, చేయాలి. కొందరు జ్ఞాన మార్గంలో ఉన్నవారు భక్తిని తేలికగా చులకనగా తీసుకుంటున్నారు.
ఈ శాస్త్రం వారికి కూడా కనువిప్పు కలిగించి, వారి సాధనలో సహకరిస్తుంది. అపరభక్తితో గమ్యం చేరలేరు. అది పరాభక్తిగా సిద్ధమవ్వాలి. మీదు మిక్కిలి సాధనగా తీసుకునే వారికి భక్తి మార్గం సులభం. భగవంతుని ఆలంబనగా చేసుకోవడం ద్వారా సాధకుడు అజ్ఞానం నుండి విడుదలవడం తేలిక. తత్త్వ విచారణ అనేది తెలివైన వారికి మాత్రమే కుదురుతుంది.
భక్తికి తెలివి కంటే శరణాగతి ముఖ్యం. శ్రద్ధ, విశ్వాసం ఉంటే ఎవరైనాన శరణాగతి చేసి భగవదర్పితం కావచ్చును. లోకంలో ఇతర మార్గాల నవలంబించే వారికంటే భక్తులే ఎక్కువగా ఉన్నారు. కనుక భక్తి శాస్త్రానికి ప్రచారం అవశ్యం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
04 Oct 2020
No comments:
Post a Comment