🌹. గీతోపనిషత్తు - 44 🌹
🍀 4. సమాచరణము - సంగము లేక, నియత కర్మను లోకహితముగ ఒనర్చుట వలన జీవుడు బంధింపబడుటకు ఎట్టి అవకాశమును ఉండదు. 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 09 📚
యజ్ఞార్థం కురు కర్మాణి : నియమితమైన కర్మను శ్రద్ధాభక్తులతో సంగము విడిచి చేయవలెనని తెలిపిన శ్రీకృష్ణుడు, చేయు కర్మ యజ్ఞార్థమై యుండవలెనని మూడవ సూత్రమున పలికినాడు. అనగా కర్మము లోకహితార్థముగ చేయుమని అర్థము. లోకహితమే తన హితము. అందుచేత కర్మమునకు ప్రాణసమానమైన లక్షణము పరహితము.
9. యజ్ఞాం త్కర్మణా న్యత్ర లోకో యం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచర ||
లోకమునకు హితము కానిది తనకు కూడ హితము కాదు. ఇది తెలిసి కర్మల నాచరించవలెను. సంఘద్రోహము, దేశద్రోహము, జీవద్రోహము చేయు కర్మల నుండి బంధము కలుగును. ఇతర జీవులకు అహితము, హింస కలుగు పనులు చేయరాదు.
మనస్సున ప్రధానముగ పరహితమే గోచరించవలెను. చేయు పనులందు పరహితమే ప్రతిబింబించవలెను.
సంగము లేక, నియత కర్మను లోకహితముగ ఒనర్చుట వలన జీవుడు బంధింపబడుటకు ఎట్టి అవకాశమును ఉండదు. అట్టివాడు సమాచరుడై యుండును. అనగా ఆచరణమున సమత్వము కలిగి యుండును. (3-9)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
04 Oct 2020
No comments:
Post a Comment