🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 12 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక
వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన
🌻 17. 'వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా' 🌻
మన్మథుని గృహముతో సాటివచ్చు అందముగల ముఖము శ్రీదేవి ముఖమై యుండగా ఆ గృహమున కేర్పరచిన అందమైన తోరణములవలె ఆమె కనుబొమలు ప్రకాశించుచున్నవని భావము.
తోరణములు గృహమునకు శుభప్రదములు. ఏ గృహమునకైనను మకర తోరణము లేర్పరచినపుడు ఆ గృహము పావనమగును. అశుభము లుండవు. ఇది భారతీయుల నమ్మకము. మకర తోరణము దివ్య జీవనమునకు సంకేతము. సంవత్సర చక్రమందలి ఉత్తరాయణ కాలమైన ఆరు నెలలు, మకర తోరణమని జ్యోతిషము ఘోషించుచున్నది.
దక్షిణాయనము ఆరునెలలు రాజ తోరణమని తెలుపుచున్నది. మకర తోరణము జీవుల ప్రజ్ఞను ఊర్థ్వ ముఖముగ గొనిపోవును. వసంత నవరాత్రి కాలమునకు పరాకాష్ఠకు చేరును. మకర మాసము నుండి కర్కాటక మాసము వరకు గల ఆరు నెలలలో వసంత నవరాత్రులు
శిఖరముగ ఏర్పడును. సమస్త సృష్టి కామేశ్వరీ - కామేశ్వరుల కామము నుండి ఏర్పడినదే! సృష్టి మన్మథ గృహము.
అందు అధో ముఖమునకు ఊర్థ్వముఖమున జీవులు ప్రయాణించు దారులు, మెట్లు కలవు. శ్రీదేవి కనుబొమలు జీవుల ప్రజ్ఞను ఊర్ధ్వముఖమునకు ఆకర్షించు తోరణములుగా వర్ణింపబడినవి. గృహతోరణములు కూడా దివ్యజీవనమునకు పునరంకిత మగుటకై ఏర్పరచుకొనవలెను గాని, కేవల మలంకారప్రాయముగ కాదు.
పర్వదినమునందు తోరణములు కట్టుకొనుటలో ఇంతటి గంభీరమైన భావము కలదని గుర్తింపవలెను. శ్రీదేవి అనుగ్రహము లేక ఊర్థ్వముఖముగ ఎవరు చనగలరు? ఆమె కనుబొమలు ఉత్తమ లోకముల ప్రవేశమునకై అనుమతి నిచ్చునట్లుగ ప్రార్థింపవలెను. చైత్రము మకరము కర్కాటకము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 17 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻. 17. Vadanasmara- māṅgalya- gṛhatoraṇa- cillikā वदनस्मर-माङ्गल्य-गृहतोरण-चिल्लिका (17) 🌻
Her face is compared to the palace of lord Manmatha (the god of love - cupid) and Her eyebrows are compared to the festoons adorning his house. Cillikā means eyebrows.
It is said that Manmatha constructed an auspicious palace, copying the face of Lalitāmbikā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 18 / Sri Lalitha Chaitanya Vijnanam - 18 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక
వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన
🌻 18. 'వక్తలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా' 🌻
లక్ష్మీప్రదమైన అనగా సర్వమంగళమైన, శుభప్రదమైన, కాంతివంతమైన చైతన్య ప్రవాహముతో మిసమిసలాడు రమణీయమైన ముఖము అమ్మవారిది. అందు మీనములవలె అందముగ, వెలుగు రూపములుగ కదలాడు అమ్మవారి కన్నులు మనోహరములు. అనగా, ధ్యానము చేయువారి మనస్సును హరింప గలిగిన సామర్థ్యము గలవి.
పై వర్ణనము నాధారము చేసుకొని అమ్మవారి ముఖమును, నేత్రములను సదా ధ్యానము చేయు భక్తునికి తన ముఖమునందు ఆకర్షణ పెరుగును. అమ్మ ముఖము ఒక చైతన్య ప్రవాహముగను, ఆమె కనులను మీనములతో పోల్చుటయందును లోతైన భావము ఆవిష్కరింప బడినది.
మీన నేత్రములు రక్షణమునకును, పోషణమునకు ప్రతీకలు. చేప తన కనులతోనే తన సంతానమును పోషించుట, వృద్ధి పొందించుట, రక్షించుట చేయును. అంతియే కాని యితర తల్లులవలె పాలిచ్చి పోషించుట యుండదు. అమ్మకూడా నట్లే.
తన దృష్టితోనే సృష్టిలోని సమస్త జీవకోటులను, గ్రహ గోళాదులను పుట్టించి, పోషించి, వృద్ధి పరచి, రక్షించు నేత్రములు అమ్మవి. ఆమె జగన్మాతృత్వమునకు ఈ ప్రక్రియ ఒక తార్కాణము. మీనాక్షిగ ఆమెను ఏకాగ్ర చిత్తముతో ధ్యానించు భక్తజనులకు లోటు ఎట్లుండగలదు? అంతియే కాదు, ఆమె మీన నేత్రములు మీనరాశి స్వభావమును పరిపూర్ణముగ వర్తింపచేయును. అంత్యమునకు, ఆరంభమునకు అధ్యక్షత వహించునది అమ్మ.
ఆరంభములో సత్యము, అంత్యములో నారంభము ఆమె సృష్టిరచనా రహస్యము. తదతీతమైన చైతన్యముగ తాను సృష్టి స్థితి లయముల నధిష్ఠించి యుండు శాశ్వత ప్రజ్ఞ లేక విశ్వ చైతన్యము అమ్మ.
శ్రీ దేవి వలెనే దేవీ భక్తులు కూడా కన్నులతో పోషించుట, రక్షించుట, అనుగ్రహించుట, ఉద్దరించుట చేయగలరు. అట్టి వారిలో మైత్రేయ మహర్షి ఈ భూమిపై అగ్రగణ్యులు. వారి కన్నులలోనికి తదేక దృష్టితో చూచువారిని క్షణ కాలముననే ఉద్ధరించగల్గు జగద్గురువులు మైత్రేయులు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 18 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 18. Vaktra- lakṣmī- parīvāha- calan- mīnābha- l ocanā
वक्त्र-लक्ष्मी-परीवाह-चलन्- मीनाभ-लोचना (18)
Her eyes appear like fishes moving in a pond. Her face is compared to a pond and Her eyes to fishes.
Fishes move very quickly. She also moves Her eyes quickly as She has to shower Her grace on the entire universe. The fish eggs become fertile by mere glance of mother fish.
In the same manner She by Her mere glance nourishes the universe. Because of the beauty of Her eyes She is also known as Mīnākṣī, Mīnalocanī, etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
04 Oct 2020
No comments:
Post a Comment