కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 67



🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 67   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 31 🌻


ఇంకా ఇప్పుడు శరీర ధర్మమంటే ఏమిటి, ఆత్మ ధర్మమంటే ఏమిటి అనే రెండింటిని స్పష్టముగా నిర్వచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.


నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

ఈ రకంగా భగవద్గీత ప్రమాణ వాక్యం - ఇది కూడా ఉపనిషద్ వాక్యమే. ఈ ఉపనిషత్తులోనుంచే స్వీకరించారు.



నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

ఆత్మని చంపబడటం ఎవరివల్లా కాదు. “నైనం చిందంతి” ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేనెప్పటికీ మరణించేవాడను కాదు. నేనెప్పటికీ పుట్టినవాడను కాదు. నేనెప్పటికీ శోషింపబడేటటువంటివాడను కాదు. నేననేది ఎప్పటికీ కూడా నిత్యమైనటువంటిదే గానీ మార్పుచెందనటువంటిది. ఎందువల్లా అంటే శరీరానికి ఆరురకములైనటువంటి వికారాలు వున్నాయి. జాయతే అస్తి వర్థతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అర్థం అయినదా అండీ?


అంటే పుట్టుట, పెరుగుట, పరిణామము చెందించుట, క్షీణించుట, మరణించుట. (పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది) ఈ రకమైనటువంటి ఆరు రకములైనటువంటి షడ్ వికార జయము కలగాలట.


ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమైందో వారికి షడ్ వికార జయం కలుగుతుంది. ఆ షడ్ వికార జయంచేత నీవు వికార రహితుడివిగా మారతావ్. ఎప్పుడైతే వికారరహితుడిగా మారావో అప్పుడేమయిందీ - నిర్వికారిగా వుండేటటువంటి అవకాశం కలుగుతుంది. “ఊర్ద్వశ్చ నిరాకారో అధశ్చ నిర్వికారతః” అనేటటువంటి సూత్రం నీకు తెలుస్తూ వుంటుంది. చాలా ముఖ్యమైనటువంటిదనమాట ఇది.



“ఊర్ద్వశ్చ నిరాకారో అధశ్చ నిర్వికారతః”


ఈ రెండు లక్షణములు కూడా ఆత్మ శబ్దానికి సంబంధించినటువంటివి. అర్ధమైందా అండి? ఈ నిర్వికారత అనేటటువంటి లక్షణం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇది పుట్టదు, పెరగదు, పరిణామము చెందదు, క్షీణించదు, మరణించదు.


ఎందుకనీ అంటే ఈ ఆరు వికారములు కలగాలి అంటే శరీరము ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకోవాలి. శుక్లశోణిత సంయోగముచేత శరీరము ఏర్పడుతోంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాని అలా శుక్లశోణిత సంయోగముతో ఈ ఆత్మ ఏర్పడటం లేదు. దానికంటే ముందు నుంచే వున్నది.


బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్మహత్ మహతో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నియోర్ ఆపః ఆపయోర్ పృధ్విః పృధ్వియోర్ అన్నం అన్నంయోర్ ఓషధిః ఓషధియోర్ జీవః


ఈ రకంగా క్రమ సృష్టి కలిగినప్పటికీ ఈ సృష్టి అంతటికీ ముందున్నటువంటి స్వరూపం ఏదైతే వున్నదో అది బ్రహ్మము. అదే ఆత్మ. స ఆత్మ. కాబట్టి శరీరముతోపాటు ఆత్మ పుట్టుటలేదు.


కాబట్టి శరీరము నశించినచో దానితో పాటు నశించదు. కారణభూతమైనది ఏదియునూ లేదు. ఈ పంచభూతములలో ఏది కారణమైనది దీనికి. ఈ సృష్టికంతటికీ కారణస్వరూపము ఏమిటీ అంటే పంచభూతాలు అని అంటాం. ఎందుకనీ ఇది పంచభూతాత్మకమైనటువంటి సృష్టి.


ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఆయా పంచభూతముల సంయోగ వియోగముల చేత, సంయోజన వియోజనముల చేత ఏర్పడుతూ వున్నది.


అన్ని ఇంద్రియములు, ఇంద్రియ ధర్మములు, ఇంద్రియాధిష్టానములు, ఇంద్రియార్ధములు అయినటువంటివన్నీ కూడా ఆ పంచభూతాత్మక మైనటువంటి గుణముల సంయోజనము చేతనే ఏర్పడుతున్నవి. కాని ఆత్మకు ఈ పంచభూతములు కారణము కాదు. ఎందువల్లనంటే ఈ పంచభూతములకంటే ముందు వున్నది ఏదో అదే ఆత్మ. - విద్యా సాగర్ స్వామి


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ


04 Oct 2020


No comments:

Post a Comment