భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 64
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 64 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 14 🌻
261. మానవుడు తన భావి జీవితంలో గాని, యీ జన్మలో భవిష్యత్తులో గాని తాను కలిసికొనబోవు-వస్తువులను,మానవులను స్వప్నములో చూచుచున్నాడు; కలిసికొనుచున్నాడు ప్రస్తుతం జీవితంలో జాగ్రదావస్థలో, ఆ స్వప్నగత రూపములే తిరిగి స్థూలరూపములుగా కన్పించినపుడు నిజముగా తాను గత స్వప్న దృశ్యములకు సాక్షి భూతుడగుచున్నాడు.
262. మానవుడు తనలో నిద్రాణమైయున్న స్వీయ సంస్కారములచే యేర్పడిన స్వప్నసృష్టిని, వర్తమాన జాగ్రత్ జీవితములో పోషించిన వాడౌచున్నాడు.
ఇట్లు స్వప్న నాటక సృష్టికి,కర్తయై ఆ స్వప్నగత దృశ్యములను జాగ్రదవస్థలో వర్తమానముగా పోషించుచు భర్తయౌచున్నాడు.
గతమునకు వర్తమానము భవిష్యత్తు గనుక ఏకకాలమందే భవిష్యత్తును కూడా స్థాపించిన వాడౌచున్నాడు.
263. వర్తమానములోనే-- భూత, భవిష్యత్తులు రెండును ఇమిడియే యున్నవి. మనము వర్తమానములో జీవించి యున్నాము. గనుక ప్రస్తుతములో మనకు గతము లేదు. భవిష్యత్తు లేదు. ప్రస్తుతము మనము జీవించియున్న వర్తమానము రేపటికి, గతముగ లయమగు చున్నది. ఇట్లు మానవుడు లయకారుడగుచున్నాడు.
264. మనకు వర్తమానమే యున్నది. నిన్న లేదు. రేపు లేదు. నేటి వర్తమానము గతమునకు భవిష్యత్తు . గతమునకు భవిష్యత్తు అయిన వర్తమానమే , భవిష్యత్తుకు గతము అగుచున్నది అనగా_ నేటి వర్తమానము కూడా.
____
Notes : లయము =నాళనము
కర్త = జగత్కర (Creator ) = ఈశ్వరుడు
ఈశ్వరుడు = మాయాళబలిత బ్రహ్మము .
రేపటికి యుండదు , లయమై పోవుచున్నది . అనగా __ గతము , భవిష్యత్తుకూడా నశించి పోవుచున్నవి .వర్తమానమే నిల్చియున్నది .
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Oct 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment