శ్రీ విష్ణు సహస్ర నామములు - 28 / Sri Vishnu Sahasra Namavali - 28


🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 28 / Sri Vishnu Sahasra Namavali - 28   🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻


మిధునరాశి- పునర్వసు నక్షత్ర 4వ పాద శ్లోకం


🌻. 28. వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ‖ 28 ‖ 🌻


🍀. వృషాహీ ---
అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)

🍀. వృషభః ---
భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.

🍀. విష్ణుః ---
అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.

🍀. వృషపర్వా ---
తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.

🍀. వృషోదరః ---
ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.

🍀. వర్ధనః ---
వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.

🍀. వర్ధమానః ---
వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.

🍀. వివిక్తః ---
విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.

🍀. శ్రుతిసాగరః ---
వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Vishnu Sahasra Namavali - 28   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Midhuna Rasi, Punarvasu 4th Padam

🌻 28. vṛṣāhī vṛṣabhō viṣṇurvṛṣaparvā vṛṣōdaraḥ |

vardhanō vardhamānaśca viviktaḥ śrutisāgaraḥ || 28 || 🌻



🌻 Vṛṣāhī:
Vrusha means dharma or merit.


🌻 Vṛṣābhaḥ:
One who showers on the devotees all that they pray for.


🌻 Viṣṇuḥ:
One who pervades everything.


🌻 Vṛṣaparva:
One who has given as steps (Parvas), observances of the nature of Dharma, to those who want to attain the supreme state.


🌻 Vṛṣodaraḥ:
One whose abdomen showers offspring.


🌻 Vardhanaḥ:
One who increases the ecstasy of His devotees


🌻 Vardhamānaḥ:
One who multiplies in the form of the universe.


🌻 Viviktaḥ:
One who is untouched and unaffected.


🌻 Śrutisāgaraḥ:
One to whom all the shruti or Vedic words and sentences flow.


Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama


04 Oct 2020

No comments:

Post a Comment