🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
దశమాధ్యాయము
🌻. జీవ స్వరూప నిరూపణము - 8 🌻
వ్యాస్నోతి నిష్క్రియ స్సర్వాన్ - భానుర్దశ దిశో యథా |
నాడీభి ర్వ్రత్త యోయాన్తి - లింగ దేహ సముద్భవాః 36
తత్త త్కర్మానుసారేణ - జాగ్రద్భో గోపలబ్దయే |
ఇదం లింగ శరీరాఖ్య - మామోక్షంన వినశ్యతి 37
ఆత్మజ్ఞానేన నష్టేస్మి - న్సావిద్యేస శరీరకే |
ఆత్మ స్వరూపావ స్థానం - ముక్తిరి త్యభీ ధీయతే 38
ఉత్పాదితే ఘటే యద్వ - ద్ఘ టాకాశత్వ మృచ్చతి |
ఘటే నష్టే యథాకాశం - స్వరూపేణా వతిష్ఠతే 39
జాగ్రత్కర్మక్ష యవశా - త్స్వప్నభోగ ఉపస్థితే |
బోధ్యావస్థాం తిరోధాయ - దేహాద్యాశ్రయ లక్షణామ్ 40
కర్మానుసారముగ జాగ్రదవస్థలో ఫలానుభవమున కై లింగశరీరము నుండి యుప్తిల్లినవై (పుట్టి) వృత్తులు నాడులతో చేరి బయల్దేరును. ఇట్టి లింగ శరీరము ముక్తి పర్యంతము నశించదు.
తత్వజ్ఞానముచేతనీ లింగ దేహము అజ్ఞానముతో కూడి నశించిన యెడల ఏ కైవల్యావస్థ యున్నదో అదే ముక్తియనబడును.
ఘటము (కుండ) పుట్టడముతోనే ఘటగత ఆకాశము బుట్టి అది నశించడంతోనే ఆకాశము స్వస్వరూపములో లీనమగునట్లు ముక్తాత్మ కూడ తన స్వపాన్ని బడయును.
జాగ్రదవస్థలో కర్మము క్షీణించుటచేత స్వప్నవస్థను పొంది జ్ఞానావ స్థల కర్మలచేత మనస్సుకు దీసికొని వచ్చిన సంస్కారముగల వాడై స్వప్నములో ఫలానుభ వేచ్చ చేత తన మాయచేత దానే మాయావంతుడై గారడి వాడి వలె అవసాంతరమును ఆశ్రయించును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 82 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam -8 🌻
Based on the Karmas in the wakeful state to enjoy the fruition of Karmas originating from the Linga deham, vriti moves through the nadis. This linga deham doesn't get destroyed till liberation.
By the TatwaJnanam (divine wisdom/knowledge), when this Linga Deham which is overlapped by karana Deham (causal body which is nothing but a blanket of ignorance) gets destroyed, then that state of Kaivalyam is the true liberation.
As like as the pot containing the air when gets destroyed, the air inside the pot becomes one with it's actual form the air of the atmosphere, the same way when the pot of ignorance gets destroyed with knowledge, the Jiva becomes a Muktatma (liberated one) and becomes one with Brahman which is the real form of the Jiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
04 Oct 2020
No comments:
Post a Comment