*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 9 🌻*
అతి స్వల్పత రాయుశ్శ్రీ - ర్భూతే శాంశాధి పోపియః,
సతు రాజా హమస్మీతి - వాది నం హన్తి స్వాన్వయమ్. 33
కర్తాపి సర్వ లోకానా - మక్ష యైశ్వర్య వానపి,
శివ శ్శివో హమ స్మీతి - వాది నం యం చ కంచన 34
ఎట్టి మహేశాం శమున బుట్టిన వాడైనను, " నేనే ప్రభువును " అనే అహంభావము ఎవనిలో ఉండునో అట్టి వానికి ఆయువు క్షీణించుటే కాకుండా నిర్వంశ మగుటకు మూలమగును.
కావున మూడు లోకములకు ప్రభువైన ప్పటికి ఐశ్వర్య వంతుడైనను దురభిమానమునకు లోను గాక శివో హం భావముతో నుండిన అధవా దాసోహం భావంతో నుండి నను ఆ పర శివ మూర్తి మిక్కిలి ప్రసన్నుం డై తనలో ఐక్య మొనర్చు కొనును.
ఆత్మనా సహ తాదాత్మ్య - భాగినం కురుతే బృశమ్,
ధర్మార్ధ కామ మోక్షాణాం - పారం యాస్యన్తి యేన వై .35
మునయస్త త్ప్ర వక్ష్యామి - వ్రతం పాశు పతాభిదమ్,
కృత్వాతు విరజాం దీక్షాం - భూతి రుద్రాక్ష దారిణః 36
జపంతో వేద సారాఖ్యం శివ నామ సహస్రకమ్,
సంత్య జ్యతేన మర్త్యత్వం శేవీం తను మవాప్య . 37
ఓయి ! (ఋషి) మునివరులారా ! తొల్లి మునీశ్వరులే ఆచరించి; ధర్మము, అధర్మము ,కామము మరియు మోక్షమనెడు చతుర్విధములగు ఫల పురుషార్ధముల సారముల చక్కగా అవగతము చేసికొన్న పాశుపత మనెడి వ్రతమునకు నీకు వివరించెదను వినుడు.
మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను బొంది, విభూతి, రుద్రాక్షలను మేన దాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్ర నామములను వల్లింపు చుండ దత్ప్రభావము చేత అశాస్వతమగు నీ మనుష్యత్వమును వీడి శివ స్వరూపమును పొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 9 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 01:
*🌻 Bhakti Niroopana Yoga - 9 🌻*
33. 34. Even if someone is an incarnation of Mahesha if he develops self pride by thinking, "I'm the Lord", such a person's life span would decline and also his lineage would get culminated.
Hence, even if someone is a lord of the three worlds, if he remains free from ego and pride, and simply either remains filled with "Shivoham" feeling or else with the feeling of Lord's Servant (Devotee), that Supreme Lord Shiva would get pleased with him and would make him merge inside himself.
36. 37. Hey Monks! I would narrate one great 'Vratam' which bestows all the 'Chaturvarga Phala Purushardhas' viz.
Dharma, Artha, Kaama, Moksha. that Vratam is called 'Pasupata Vratam'.
You all may take the 'Viraja Deeksha' as per my instructions by applying Ash and wearing Rudraksha Mala, and chant the Shiva Sahasranama which is a summary taken from all the four vedas.
If you do this kind of 'deeksha' you would leave your this ephimeral human body and would attain divinity by gaining Shiva's form itself.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment